సడన్‌గా విమానాశ్రయంలో ప్రత్యక్షమైన రామ్‌చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడన్ గా ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. దాంతో అసలు చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు? వేకెషన్ కి వెళ్తున్నాడా లేదా ఏదయినా మూవీ షూటింగ్ కి వెళ్తున్నాడా? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. మరి రామ్ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ విన్ అయిన తరువాత నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోయ్యడు చరణ్. ప్రస్తుతం చరణ్ వరుస పాన్ ఇండియా సినిమా లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో సినిమా, ఆ తరువాత బుచ్చిబాబు డైరెక్షన్ లో, ఇలా ఒకదానితరువాత ఒకటి కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్ ‘ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఆగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం శరవేగంగా జరుగుతుంది. గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది మొదట్లో లేదా వేసవి సెలవులో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాత దిల్ రాజు. అయితే బిడ్డ పుట్టిన తరువాత 3 నెలల సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు చరణ్. దాంతో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ వెనుకబడింది. ఈ గ్యాప్ లో ఇండియన్ 2 సినిమా ని కంప్లీట్ చేసుకున్నాడు దర్శకుడు శంకర్. ఫ్యామిలీ టైమ్ కంప్లీట్ అయిన తరువాత గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ని వేగవంతం చేసాడు చరణ్. ఆ షూటింగ్ కొసం వెళ్తూ తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కెమెరాలకు చిక్కాడు మన మెగా పవర్ స్టార్.

ఎయిర్పోర్ట్ లో కంప్లీట్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చాడు రామ్ చరణ్. అతనికి బాగా ఇష్టమైన బ్లాక్ డ్రెస్ లో చేతిలో ఒక ల్యాపి బ్యాగ్, కళ్లకు గాగుల్స్ పెట్టుకొని చిరు నవ్వు తో చాలా హ్యాండ్సమ్ గా కనపడ్డాడు చరణ్. ఎయిర్ పోర్ట్ లో చరణ్ దిగిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అయితే చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. ఇకపోతే గేమ్ చేంజెస్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.