యంగ్ బ్యూటి శ్రీలీల టైం వెరీ బ్యాడ్.. ఇలా అడ్డంగా ఇరుక్కుపోయిందేంటి..!

టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి గుడ్ గా.. ఎవరికి బ్యాడ్ గా క్రియేట్ అవుతుందో ఎవరు చెప్పలేం . మన తలరాత రాసిన బ్రహ్మ కూడా మన టైం ని మార్చలేడు . అంత కఠినంగా ఉంటాయి. అయితే ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుస్తున్న శ్రీలీల టైం అలాగే తగలాడింది అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి . ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీలీల హవా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది .

అయితే వరుస ఆఫర్లు వస్తున్నాయి అన్న ఆత్రుతతో అమ్మడు కాల్ షీట్స్ అన్నిటిని వెంట వెంటనే అడ్జస్ట్ చేసి స్టార్ హీరోలకి ఇచ్చేసింది . ఇప్పుడు ఆమెతో సినిమాకి కమిట్ అయిన మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని ఫిక్స్ చేసుకోవడంతో శ్రీలీలకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఒకరోజు ఉదయం హైదరాబాదులో ఉంటే మరో రోజు ఫారిన్ కంట్రీస్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

( Photos : Instagram )

ఇలాంటి క్రమంలోనే శ్రీలీల పనికి మేకర్స్ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు శ్రీలీల ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని ఇలా బ్యాక్ టు బ్యాక్ కాల్ షీట్స్ ఇచ్చేస్తే ఇప్పుడు మేకర్స్ పరిస్థితి ఏంటి అని ..? ఒక సినిమా కోసం మరొక సినిమాని వదులుకుంటుందా ..? ఒక సినిమా చేసి మరో సినిమా మేకర్స్ ని ఇబ్బంది పెడుతుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . తానే తెలివైనది అంటూ చెప్పుకునేలా ముందుకు దూసుకెళ్లిన శ్రీలీల ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ ని ఎలా మ్యానేజ్ చేస్తుంది అనేది జనాలకు అర్థం కావడం లేదు. చూద్దాం శ్రీలీల ఏం చేస్తుందో..?