ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. అమ్మాయిల హృదయాల్లో లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు చిత్రం సినిమాతో మొదటి టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాడు. 2014లో ఉదయ్ కిరణ్ మనస్థాపానికి గురై తన రూమ్‌లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు.
అతని మరణం కోట్లాదిమంది అభిమానుల మనసును కలచివేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి 8 సంవత్సరాలైనా ఆయనకు సంబంధించిన న్యూస్ ఏదైనా వచ్చిందంటే చాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి చిరంజీవి కారణమని. తనకు అవకాశాలు రాకుండా అడ్డుపడి మనస్థాపానికి గురైయ్యాలే చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి చాలామంది యువకులకు తన సపోర్ట్ ను అందించి మంచి స్టేజ్లో ఉంచాడు. అలాంటి చిరంజీవి.. ఉదయ్‌కిరణ్‌కు అవకాశాలు రాకుండా అడ్డుపడ్డాడు అనే దానిలో నిజం లేదట.
చిరంజీవి కూతురు సుస్మితనే ఉదయ్‌కిరణ్ పెళ్లి చేసుకోవాలనుకుందని కానీ చిరంజీవి తన స్థాయికి ఉదయ్ కిరణ్ సరిపోడనే ఉద్దేశంతోనే వారిద్దరి పెళ్లికి అంగీకరించలేదని తెలుస్తుంది. దాని తర్వాత ఉదయ్ కిరణ్ లవ్ ఫెయిల్యూర్ అవ్వడం.. వేరే అమ్మాయిని వివాహం చేసుకున్న తరువాత సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. మానసికంగా కృంగిపోయి మనస్థాపానికి గురై ఉరివేసుకున్నాడట. కానీ కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉదయ్‌ని చాలామంది ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు.