అమిత్ షాతో చిరంజీవి రామ్ చరణ్ భేటీ.. వైరల్ గా మారుతున్న చర్చ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో కూడా చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా నిలిచారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలో సినిమాలలో బిజీగానే ఉన్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మాత్రం ఇటీవలే RRR సినిమాలో నటించి ఆస్కార్ వేదికలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక పలు అవార్డులను కూడా అందుకోవడం జరిగింది రామ్ చరణ్.

ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు కూడా గోల్డెన్ గ్లోబల్ అవార్డు కూడా దక్కించుకుంది. అవార్డు అనంతరం ఎన్టీఆర్ త్వరగా తిరిగి హైదరాబాద్కు వచ్చేశారు. కానీ రామ్ చరణ్ మాత్రం అక్కడే ఉంటు కొద్ది రోజులు ఎంజాయ్ చేసి తిరిగి ఢిల్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇలా ఢిల్లీకి వచ్చిన సమయంలో బిజెపి అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది.ఆస్కార్ వచ్చాక మొదటిసారి ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్ తన తండ్రితో కలిసి అమిత్ షాను కలిశారు.

అయితే ఇలా కలవడం వెనక సినీ రాజకీయ వర్గాలలో మాత్రం పలు ఆసక్తిని రేపుతోంది.. ఈబేటి మర్యాదపూర్వకమైన భేటీనే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇదంతా ఇలా ఉండగా ఇండియా టుడే ఈవెంట్ కు రామ్ చరణ్ ఆహ్వానించిన విషయం తెలిసింది ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో ప్రధాని మోడీతో కూడా ఆయన వేదికను పంచుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest