అక్కినేని vs భానుమతి మధ్య ఇంత పెద్ద గొడ‌వ జ‌రిగిందా…!

అప్పట్లో భానుమతి పేరు ఎంతో సంచలనమనే చెప్పాలి. మహానటి సావిత్రి, జమున కంటే ముందే మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా అగ్ర హీరోలతో వరుస‌ సినిమాల్లో నటించారు. అయితే ఆమె చేసే సినిమాల్లో రొమాన్స్, లవ్ ట్రాక్ ఉన్న కథల విషయంలో వెనకొడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం వల్లే ఈమె చిత్ర పరిశ్రమంలో కాస్త వెనుకబడ్డారు. భానుమతి హీరోయిన్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎన్నో మంచి సినిమాల్లో నటించారు.

ఇక తను నటించాలనుకునే సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే మాత్రం ఖ‌చ్చితంగా చేసేదని అంటారు. ఆ టైమ్‌ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలైనా తనకు కథ నచ్చలేదు అంటే ఖ‌చ్చితంగా ఆ సినిమాను రిజెక్ట్ చేసేవారు. ఇదే విషయంలో ఆ సమయంలో అక్కినేని కి ఆమెకు మధ్య వివాదం ఏర్పడింది అంటారు. అక్కినేని పై ఆధిపత్యం సాధించడం కోసం ఆమె ఎన్టీఆర్ తో ఎక్కువగా స్నేహంగా ఉండేవారు అనే ప్రచారం కూడా జరిగింది.

ఇక విప్రనారాయణ సినిమాలో భానుమతి ఒక లవ్ సీన్ చేసే దగ్గర దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని కూడా అంటారు. అదే సమయంలో హీరో అక్కినేని కూడా పలు జాగ్రత్తలు చెప్పారట. ఆ సమయంలోనే అక్కినేని చేయి భానుమతికి తగలడంతో అక్కడ పెద్ద గొడవ జరిగిందని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గ్యాప్ అలాగే కొనసాగుతూ వచ్చింది.

ఆ తర్వాత హీరోయిన్ మీనా తొలి సినిమాగా వచ్చిన సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో అక్కినేనితో కలిసి భానుమతి నటించాల్సి వచ్చింది. అక్కినేని కూడా ముందు ఓకే అన్నారు. కానీ తర్వాత అనూహ్యంగా న్నడ నటి రోహిణి హట్టంగిడిని సినిమాలో తీసుకున్నారు. ఇక అప్పుడు ఈ విషయం తెలిసిన భానుమతి సినిమాలో పెద్ద స్టోరీ లేదు అన్నారట. ఇదే విధంగా భానుమతి తన చివరి శ్వాస వరకు అక్కినేనితో సినిమా నటించలేదు.

Share post:

Latest