ఆ డ్రెస్సేంటి..? నీ అవ‌తార‌మేంటి..? రాశి ఖ‌న్నాను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!

బబ్లీ బ్యూటీ రాశి ఖ‌న్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఊహ‌లు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ‌.. తక్కువ సమయంలోనే ఇక్కడ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడ సైతం మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఈ మధ్యకాలంలో వ‌రుస ఫ్లాపులు పడడంతో రాశి ఖ‌న్నా గ్రాఫ్ బాగా డౌన్ అయింది. ఇదే సమయంలో రాశి ఖ‌న్నా మనసు బాలీవుడ్ పై మళ్ళింది. రుద్ర వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. రీసెంట్ గా `ఫార్జీ` సిరీస్ తో మ‌రోసారి అన అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. రాశి పోషించిన ఆర్బీఐ ఆఫీసర్ `మేఘా` పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సిరీస్ హిట్ అవ్వ‌డంతో బాలీవుడ్ నుంచి రాశి ఖ‌న్నాకు మ‌రిన్ని ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ భామ అక్క‌డ `యోధ` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇక‌పోతే ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో రాశి ఖ‌న్నా హ‌ద్దులు దాటి అందాలు ఆర‌బోస్తోంది. తాజాగా కూడా త‌ళుకుల డ్రెస్ లో ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ డిఫ‌రెంట్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది.

అయితే రాశి లేటెస్ట్ ఫోట్‌షూట్ పై నెటిజ‌న్లు మండిపడుతున్నారు. ఆ డ్రెస్సెంటి.. నీ అవ‌తార‌మేంటి అంటూ ఏకేస్తున్నారు. రాశి లుక్ ఏ మాత్రం ఆక‌ట్టుకునే విధంగా లేదు. పైగా ఆమె హెయిర్ స్టైల్ అస్స‌లు సెట్ కాలేద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest