చిన్నతనంలో సాయిపల్లవి ఇలాంటి పనులు చేసేదా.. మ‌హ చిలిపి పిల్ల రా బాబోయ్..!

సినిమా పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఇందులో ఎందరో నటీమణులు, నటీనటులు వస్తుంటారు పోతుంటారు. వారిలో కొందరు తమ నటనతో చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు. మరికొందరు ఉరుము, మెరుపుల్ల వచ్చిపోతుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్నంతకాలం గుర్తుండిపోయే నటీమణులలో మరి కొందరు డైరెక్టర్ డిమాండ్స్ ని పక్కన పెట్టి వారి మనసుకు నచ్చితేనే ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంటామని చుట్టూ ఒక గీతను గీసుకున్న హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు.

Sai Pallavi

వారిలో నేటితరం హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసులో ఉంటారు.ఈమెని అందరూ ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుచుకుంటారు. అంత క్రేజ్ ఉన్నా కూడా తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే నటిస్తూ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తన నటన అభినయంతోనే చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సాయి పల్లవి సినిమాల్లోకి రాకా ముందు డాక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఇందులో ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.కోలీవుడ్ క్రేజీ హీరో జయం రవి, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ కాంబోలో వచ్చిన ధూమ్ ధామ్‌ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో ఆమె స్నేహితురాలిగా సాయి పల్లవి నటించింది. ఆ తర్వాత ప్రసన్న, మీరాజాస్మిన్ హీరో హీరోయిన్లుగా నటించిన మరో కోలీవుడ్ సినిమాలో కూడా సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఈ విధంగా ఈమె చిన్నతనం నుంచి చిత్ర పరిశ్రమ లోకి రావాలనే ఆసక్తి ఉన్న సాయి పల్లవికి డాన్స్ అంటే కూడా ఎంతో ఇష్టం, ఆ మక్కువతోనే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 3 లో ఒకరిగా నిలిచింది. ఆ తర్వాత మలయాళం ‘ప్రేమమ్’ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించే ఛాన్స్ దక్కింది.. ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత ఇక సాయి పల్లవి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Share post:

Latest