రానాకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. అసలు స్టోరీ తెలిస్తే సినిమాయే తీసేయవచ్చు..!

టాలీవుడ్ దివంగత అగ్ర నిర్మాత రామానాయుడు కుటుంబం నుంచి మూడోతరం వారసుడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రానా. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు పెద్దకొడుకు రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనలోని వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరించాడు.

Rana Daggubati Wishes Father Daggubati Suresh Babu On His Birthday With An Adorable Post

రానా కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిగా నటించి తన నటనలోని నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించాడు. ఈ సినిమాతో తన క్రేజ్‌ను నేషనల్ వైడ్‌గా పెంచుకున్నాడు. బాహుబలి సినిమాతో వచ్చిన తన క్రేజ్‌ ను కాపాడుకుంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

Rana Daggubati & Venkatesh Met Rajiv Gandhi Murder Investigator

రానా సోలో హీరో గానే కాకుండా అటు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తూ ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నాడు. దీనికి నిదర్శనం బాహుబలి, భీమ్లా నాయక్, రుద్రమదేవి వంటి సినిమాలే వాటికి నిదర్శనం.రానా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే మిహికా బజాజ్‌ అనే అమ్మాయిని ప్రేమించి ఇరు కుటుంబాల అంగీకారంతో 2020లో ఒకటయ్యారు. రానా పేరు విషయానికి వస్తే ఎవరు ఊహించని పెద్ద కథ ఒకటి ఉంది. రానా అసలు పేరు రామానాయుడు.

Rana Daggubati Completes 12 Years In Film Industry, Wife Miheeka Bajaj Pens Down A Note Congratulating The Actor

రానా అనే పేరు ఎలా పెట్టారో ఇప్పుడు చూద్దాం. ఇక రానాకు ముందుగా తన తల్లి లక్ష్మి సిద్దార్థ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించింది. అయితే కొడుకు బారసాల చేయించే రోజున తండ్రిని మీ కొడుకు పేరు రాయాలని చెప్పక అప్పుడు సురేష్ బాబు తన తండ్రి పేరు రామానాయుడు అని రాశాడు. ఆ పేరునే తన కొడుకుకి పెట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు సురేష్ బాబు, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తన కొడుకుకి ఆ పేరు పెట్టాడు. సురేష్ బాబు భార్య భర్త చేసిన పనికి ఏమీ అనలేక ఆ పేరునే తన కొడుకుకి పెట్టింది. రామానాయుడు మాత్రం తన కొడుకు చేసిన పనికి ఎంతో ఆనందించాడు.

Rana Daggubati's magnum opus 'Hiranyakashyap' temporarily shelved because of pandemic | The News Minute

సురేష్ బాబు స్నేహితుల్లో కొందరు రామానాయుడు గారి మీద ఉన్న గౌరవంతో ఆ పేరుతో సురేష్ బాబు కొడుకుని పిలవలేక రామానాయుడు అనే పేరులో ఉన్న మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తామని చెప్పారట. అప్పుటి నుంచి రామానాయుడు పేరు కాస్త రానాగా మారింది. ఆ పేరుతోనే రానా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రానా పేరు వెనుక ఉన్న అసలు కథ ఇది. ఈ విషయాన్ని రానా ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

Share post:

Latest