బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన అనుప‌మ‌.. క‌ళ్ల‌తోనే క‌ట్టిప‌డేసిందిగా!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గత ఏడాది ఈ అమ్మ‌డుకు బాగా కలిసి వచ్చింది. ఈమె నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించాయి.

హ్యాట్రిక్ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ లోకి వ‌చ్చేసిన‌ అనుపమ.. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా `డీజే టిల్లు స్క్వేర్` లో నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ పలు ప్రాజెక్టులకు అనుపమ సైన్ చేసింది.

ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే అనుప‌మ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు అదిరిపోయే ఫోటోషూట్ల‌తో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో అందంగా ముస్తాబై దర్శనమిచ్చింది.

వంపు సొంపులు పోతూ తన అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. మత్తెక్కించే కళ్ళతో అందరిని కట్టిపడేసింది. అనుపమ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest