మెహబూబ్ కు ఝలక్ ఇచ్చిన బిగ్ బాస్ శ్వేత… ఏం పీకావంటూ పరువు తీసేసింది పాపం?

ఈమధ్య కాలంలో వివిధ రకాల బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోల సందడి ఎక్కువైంది. TRPలు గట్టిగా రావడంతో ఛానల్ కొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ క్రమంలో చాలా షోలు జబర్దస్త్ షోని టార్గెట్ చేస్తూ దానిలో సగభాగం రేటింగ్స్ ని కూడా అందుకోలేకపోవడం విశేషం. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా పలు రకాల చానల్స్ లో అనేక రకాల కామెడీ షోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే తాజాగా మొదలైన టీవీ షోలలో ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ షో ఒకటి. ఈ షోకి ప్రదీప్ హోస్ట్ గా వ్యవరిస్తున్నాడు.

ఇందులో సీరియల్ ఆర్టిస్టులు, కపుల్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేవారు జంటలుగా పాల్గొంటుంటారు. కాగా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. కాగా తాజాగా ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. దాంతో దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ప్రోమోలో కొన్ని జంటల ఇంట్రడక్షన్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక వచ్చే జంటల పై యాంకర్ పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించాడు.

ఇందులో భాగంగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మెహబూబ్ దిల్ సే శ్వేతా నాయుడు, సిద్ధూ – సోనియా సింగ్, యాంకర్ స్రవంతి చొక్కారపు – ప్రశాంత్ జంటలుగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇందులో ముందుగా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ – శ్వేతా కేజీఎఫ్ 2 సినిమాలో మెహబూబా సాంగ్ కి డాన్స్ చేయగా డాన్స్ అయిపోయిన తరువాత శ్వేత, మెహబూబ్ దగ్గరికి వచ్చి ఏం పీకావని కంగ్రాట్స్ చెప్పడానికి? అని అంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share post:

Latest