విలక్షన నటుడు సత్యదేవ్ ను ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. కొన్నేళ్ల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సత్యదేవ్ తాజాగా `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.
ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించారు. నాగశేఖర్ దర్శకుడిగా వ్యవహరించారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన రవి నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నేడు గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సత్యదేవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కూడా పంచుకున్నాడు. సాధారణంగా సూసైడ్ బాంబర్స్ ట్రిగర్స్ ను కాలి సాక్స్ లో ఉంచుకుంటారు. ఆ విషయం సత్యదేవ్ కి తెలియదు. ఓసారి ఎయిర్ పోర్ట్ లో సత్యదేవ్ పక్కనున్న వ్యక్తి పాస్ పోర్ట్ తన కాలులో పెట్టుకున్నాడు. అతడు పాస్ పోర్ట్ తీయటానికి ట్రై చేస్తుండగా పోలీసులు అనుమానించి అతడితో పాటు సత్యదేవ్ ని కూడా సూసైడ్ బాంబర్ అనుకుని అరెస్ట్ చేశారట. ఈ విషయాన్ని సత్యదేవ్ స్వయంగా తెలిపారు.