టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తరవాత యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న పక్క మాస్ మసాలా సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ షూటింగ్ కోసం సినిమా యూనిట్ ఫారిన్ టూర్ కి వెళ్లారు.
అయితే ఈ మాస్ మసాలా సినిమాలో చిరంజీవితో పాటుగా మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మరి ఇప్పుడు ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ కు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టేశారు.
రవితేజ క్యారెక్టర్ అప్డేట్ను డిసెంబర్ 12న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లుగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్తో రిలీజ్ చేసిన రవితేజ ప్రి లుక్ కూడా ఎంతో సాలిడ్ గా ఉంది. ఆ ఫోటోలో ఓ చేతిలో మేకపిల్ల మరో చేతిలో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ ని లాక్కొస్తున్న రవితేజ పిక్‌ని చూస్తుంటే ఊర మాస్‌గా అనిపిస్తుంది. ఇక దీని బట్టి చూస్తుంటే రవితేజ ఆగమనం మరో లెవల్లో ఉండబోతుందని ఈ ప్రిలుక్ పోస్టర్ని చూస్తేతే అర్థమైపోతుంది. ఇప్పుడు రవితేజ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.