మళ్లీ సినిమాలపై మనసు పడుతున్న మంత్రి రోజా.. అలాంటి సినిమాలో..!

ప్రముఖ సినీనటి మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల నుంచి రాజకీయాలలో మంత్రి పదవిని దక్కించుకున్న ఈమె రాజకీయాలకే పరిమితమైంది. అయితే సినీ అభిమానులలో మాత్రం ఈమెకు ఏ మాత్రం క్రేజ్ దక్కలేదని చెప్పవచ్చు.. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన రోజా ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలలో నటించకుండా బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈమె.. ఇటీవల మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కి కూడా స్వస్తిపలికి రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది.

అయితే మంత్రి పదవి తర్వాత మళ్లీ రాజకీయాలలో కొనసాగుతుందో లేదో కానీ అలాంటి సినిమాలో నటించాలని ఆశపడుతోంది. తన సినీ కెరియర్ లో దాదాపుగా అన్ని షేడ్స్ ఉన్న పాత్రలలో నటించిన రోజా.. ప్రస్తుతం కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా నటించిన అరుంధతి తరహా సినిమాలలో నటించాలని ఆశపడుతోంది. అనుష్క కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అరుంధతి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా సీక్వెల్ ను చేయాలని కోడి రామకృష్ణ ఎంత చెప్పినా అనుష్క వినలేదు. కానీ ప్రస్తుతం ఆయన స్వర్గస్తులైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ వయసులో రోజా ఇలాంటి తరహా పాత్రలు చేయాలని ఆశపడుతోంది . ప్రస్తుతం ఈమె వయసు 50 సంవత్సరాలు. మరి ఈ వయసులో ఈమెకు ఇలాంటి పాత్రలు సెట్ అవుతాయని కూడా చెప్పలేము. అయితే రోజాకు అటు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈమె కోరిక మేరకు ఎవరైనా దర్శకనిర్మాతలు అలాంటి కథ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.

Share post:

Latest