పర్చూరులో వైసీపీ ఫ్లాప్ ప్లాన్స్?

ఎలాగైనా టీడీపీ కంచుకోటల్లో పాగా వేయాలని చెప్పి అధికార వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది..గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లని సైతం గెలుచుకుని 175కి 175 సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. కుప్పంతో సహ ఇతర స్థానాలని గట్టిగానే టార్గెట్ చేశారు.

ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న పర్చూరు స్థానాన్ని కూడా టార్గెట్ చేశారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు గెలిచారు..ఇప్పటికీ ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో టీడీపీ బలం ఎక్కువగానే ఉంది. ఏలూరికి చెక్ పెట్టడంలో వైసీపీ విఫలమవుతుంది. అయితే వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న రావి రామనాథం బాబు బాగానే కష్టపడుతున్నారు..ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతున్నారు. గడపగడపకు వెళ్లడంలో ఈయనే టాప్‌లో ఉన్నారు.

అయితే ఈయన కమ్మ వర్గానికి చెందిన నేత..అటు ఏలూరి కూడా కమ్మ వర్గం నేత. కమ్మ వర్గం అంటే..ఆ వర్గం ఓట్లు ఎక్కువగా టీడీపీకే వెళ్తాయి. అందుకే ఈ సారి కమ్మ వర్గం నేతకు కాకుండా కాపు వర్గానికి చెందిన నేతకు సీటు ఇవ్వాలని జగన్ చూస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లేదా రవిశంకర్‌కు పర్చూరు సీటు ఇవ్వాలని చూస్తున్నారని తెలిసింది. కానీ ఆమంచి మాత్రం చీరాల వదిలి రావడానికి ఇష్టపడటం లేదు. ఏదేమైనా గాని పర్చూరు సీటు కాపు నేతకు ఇవ్వాలని చూస్తున్నారు.

దీంతో పర్చూరులో ఉన్న కాపు ఓట్లు వన్‌సైడ్‌గా పడతాయని, అప్పుడు గెలిచే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. కమ్మ నేతగా ఉన్న రావి రామనాథంని తప్పిస్తే…వైసీపీకి సపోర్ట్ చేసే కమ్మ ఓట్లు పోతాయి. పర్చూరులో దాదాపు 30 శాతంపైనే కమ్మ ఓటర్లు వైసీపీకి మద్ధతు ఇస్తారు. రావిని తప్పిస్తే ఆ ఓట్లు పోతాయి. రావి కూడా పార్టీ గెలుపు కోసం పనిచేయరు.

అటు జనసేన టీడీపీతో కలవడం వల్ల కాపు ఓట్లు కూడా పూర్తి స్థాయిలో పడవు. అంటే ఎటు చూసుకున్న వైసీపీ ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా ఉంది.

Share post:

Latest