వంశీ కాన్ఫిడెన్స్..జీవితాంతం ఎమ్మెల్యే..టీడీపీకి ఛాన్స్ లేదా?

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు.  కాన్ఫిడెన్స్ ఉంటే విజయాలు దక్కుతాయి..కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. గత ఎన్నికల ముందు టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో రాజకీయాలు చేసి దెబ్బతింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళుతుంది. ఇంకో 30 ఏళ్ళు తానే సీఎంగా ఉంటానని జగన్ అంటున్నారు..175కి 175 సీట్లు గెలవాలని చెబుతున్నారు. ఈ మాటలు బట్టి చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఖచ్చితంగా అనిపిస్తోంది.

ఇక జగన్ బాటలోనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు..టీడీపీ పని అయిపోయిందని ఇంకా తమకు తిరుగులేదని చాలామంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని చెబితే అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు..కానీ తాను ఉన్నంతకాలం గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచేది తానేనని వంశీ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసిన అంతిమంగా ప్రజలు తనవైపే ఉన్నారని అన్నారు. ఇప్పుడు ప్రజలు ఆయన వైపే ఉండొచ్చు..నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉండొచ్చు..కానీ జీవితాంతం ఆయనే ఎమ్మెల్యే అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ రోజులు ఒకేలా ఉండవు..అధికారం ఎప్పుడు శాశ్వతం కాదనే విషయాలని గుర్తు పెట్టుకోవాలి. లేదంటే రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగులుతాయి.

వాస్తవానికి ఇప్పుడున్న పరిస్తితుల్లో గన్నవరంలో వంశీనే స్ట్రాంగ్ గా ఉన్నారు. టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న బచ్చుల అర్జునుడు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఒకవేళ ఎన్నికల సమయంలో బలమైన అభ్యర్ధిని పెడితే..గన్నవరంలో వంశీకి రిస్క్. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల మీద ఫోకస్ చేస్తే బెటర్…ఇంకా జీవితాంతం ఎమ్మెల్యే గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు అని చెప్పొచ్చు.

Share post:

Latest