సమంత ఏమిటి ఇలా అయిపోయింది, మరీ ఇంత నీరసంగానా?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో ‘మయోసైటిస్’ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధి ఆమెని కబళించింది. అయితేనేం, సామ్ ఒక యోధురాలు. మొదటినుండి ఆమె విధితో పెద్ద పోరాటమే చేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసినదే. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల తరువాత కొన్నాళ్ళు సామ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్ళకు తేరుకొని విజయవంతమైన చిత్రాలలో నటించి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.

అంతా బాగుంది అనుకొనే సరికి మాయో సైటిస్ మహమ్మారి సామ్ ని కబళించింది. ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. సామ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకి రోగం తగ్గిపోవాలని కురుకుంటున్నారు. ఈ క్రమంలో సమంతకి మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. అయితే నవంబర్ 11న సమంత నటించిన యశోద చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో యశోద చిత్ర ప్రమోషన్స్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఆ సినిమా నిర్మాతలను కాస్త పీడిస్తోంది.

ఇక సామ్ సినిమా విశేషాలకొస్తే, సమంత ఇందులో మెయిన్ లీడ్. సామ్ ప్రమోట్ చేస్తేనే సినిమాపై బజ్ ఏర్పడుతుంది, కానీ దానికి ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం సహకరించడం లేదు. కానీ అక్కడున్నది ఓ వారియర్ సమంత. సామ్ జీవితంలో అనేకరకాల ఒత్తిళ్లకు లోనైంది. చివరి క్షణం వరకు కష్టబడటం ఆమె ప్రత్యేకత. ఇకపొతే సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుకున్న పని వెంటనే చేసి చూపించాలి. అతని నుంచే ఆ మోటివ్ ని నేను రుణంగా తీసుకున్నా. యశోద ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగా అని పేర్కొంది. ఈ సందర్భంగా సమంత బ్లాక్ డ్రెస్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది.

Share post:

Latest