బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈ సీనియర్ నటి ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో రమీక స్న్గా నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ సీనియర్ నటి బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
90వ దశంలో రవీనా స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.. ఆ టైంలో ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ఆ రోజుల్లో ఆమెను చూడడానికి వారి ఇంటి వద్దకు వందల మంది వచ్చేవారట. ఆ టైంలోనే అందరూ అభిమానులు ఏమో కానీ తనకొక అభిమాని తలుచుకుంటే మాత్రం భయం వచ్చేస్తుందని చెప్పింది. ఆ రోజుల్లో ఒక అభిమాని ఆమెకు రక్తంతో ప్రేమ లేఖలు, గిప్టులు, న్యూడ్ వీడియోలు వంటివి కొరియర్ లో ఈమె ఇంటికి పంపేవాడట.
ఇక తాను తన ఫ్యామిలీతో బయటికి వెళ్లినప్పుడల్లా కారుపై రాయి విసిరి తాను బయటికి వచ్చి నువ్వు నా ప్రేమను ఒప్పుకోమని భయపెట్టేవాడట. ఈ ఘటనపై చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించానని ఇక తర్వాత అతను మా ఇంటి ముందు కూడా చాలా సార్లు తిరుగుతూ రిక్కీ కూడా నిర్వహించాడని తన ప్రేమను ఒప్పుకోవాలని చాలా రోజులు ఇంటి గేటు ముందే కూర్చున్నాడని ఈమె చెప్పింది. నా జీవితంలో అలాంటి భయానక దృశ్యం నేనెప్పుడూ చూడలేదని ఆమె చెప్పుకొచ్చింది.