దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా బాలీవుడ్‌కు పరిచయమైన జాన్వి కపూర్.. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన మిలీ సినిమా థియేటర్లో విడుదలై సందడి చేస్తుంది.ఈ సినిమాను 2019లో మలయాళంలో సూపర్ హిట్ అయిన హెలెన్ కి రీమేక్ గా హిందీలో తెరకెక్కించారు.
అయితే ఈ క్రమంలోనే జాన్వి కపూర్ డేటింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఎప్పుడు రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమెపై వస్తున్న డేటింగ్ రూమర్లుపై ఆమె స్పందించింది.
ఆ ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ.. ‘అతను చాలా సంవత్సరాలు నుండి నాకు తెలుసు.. అతను నా దగ్గర ఉంటే నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంటుంది. అతను నాకు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం’. ‘నా ప్రతి విషయంలో నాకు మద్దతుగా నిలుస్తాడు. నేను అతనిని నా ఫ్యామిలీ కన్నా బాగా నమ్ముతా. ఎంతో మంచి వ్యక్తి అంటూ జాన్వి అతని పొగడ్తలతో ముంచెత్తింది’.
జాన్వి, ఓర్వాన్ లు తరచుగా విహార యాత్రలకు కలిసి వెళుతుంటారు. తాజాగా హలో వీన్ సందర్భంగా ఓర్వాన్ నిర్వహించిన పార్టీకి జాన్వి కూడా వెళ్ళింది. దీనికి ముందు దీపావళి పండగ సెలబ్రేషన్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో ప్రదేశాలకు టూర్లు కూడా వెళ్లారు.. ఓర్వాన్ కూడా ఎప్పటికప్పుడు జాన్వితో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు తరచూ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.