బ్రేకింగ్: సమంత తన వ్యాధి పై భావోద్వేగం… ఇంకా చావలేదంటూ..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ భామ త్వరగా కోలుకోవాలని అభిమానులు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు’.సమంత తాజాగా నటించిన సినిమా యశోద విడుదలకు సిద్ధమవడంతో ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు.

‘ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధి చాలామంది ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని సమంత చెప్పుకొచ్చింది. తాను కూడా దీన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది’.ఈ సమయంలో ఈమె తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ‘నేను త్వరలోనే దీని నుంచి బయట పడతానని.. ప్రస్తుతానికి అయితే నేను చనిపోలేదు అన్నారు.

మన చేతుల్లో ఏది ఉండదని మన లైఫ్ డిసైడ్ చేసేది పైవాడని అన్నారు’. ‘నేను ఇప్పుడు తీవ్రమైన కఠిన పరిస్థితుల్లో ఉన్నానని.. అందరి జీవితాల్లో మంచి రోజులు చెడ్డ రోజులు ఉంటాయని సమంత అన్నారు’. ‘ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు ఒక్కొక్కసారి ఒక అడుగు కూడా వేయలేనేమో అని కూడా అనిపిస్తుందని.. అయితే తాను పోరాటం చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది సమంత’.

Share post:

Latest