టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే సినిమాతో యావత్ తెలుగు యువతని మాయ చేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగలేదు, ఆ సినిమాలో నటించిన మన అక్కినేని వారసుడిని కూడా వలలో వేసుకొని ఏకంగా మూడుముళ్లు వేయించుకుంది. కాని అనూహ్య పరిణామాల వలన వారి వివాహబంధానికి ఏడాది క్రితమే ఫుల్ స్టాప్ పడింది. ఆ తరువాత సామ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.
అయితే, సమంత గోడకు కొట్టిన బంతిలాగా అంతే త్వరగా కోలుకొని సినిమా కెరీర్లో దుమ్ము దులుపుతుందని ఎవరూ ఊహించలేదు. అవును, ఇక్కడ ఓ సినిమా హీరోయిన్ తన పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అయిపోతే దాని పని ఇంక అయిపోయిందని అంతా అనుకుంటారు. ఆమె మనోభావాలతో ఎవరికీ అవసరం ఉండదు. అయితే అలాంటివాటిని సమంత ధీటుగా ఎదుర్కొంది. మరి టైం బాలేదేమో గాని, ప్రస్తుతం సమంత ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఖుషీ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ విషయమై తాజాగా సామ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే దాన్ని చూసి అపార్ధం చేసుకోకండి. ఆనందంలో సామ్ అలా ఐ లవ్ యూ చెప్పేసింది. సమంత నటించిన యశోద చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద ఆమె భారీ కటౌట్స్ అభిమానులు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దాన్ని చూసిన సమంత ఐ లవ్ యూ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.