మరో బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. తేడా కొట్టిందా..తడి బట్టే..!!

బ్రహ్మాస్త్ర ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పెళ్లి తర్వాత అలియా భట్ – రణబీర్ కపూర్ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, షారుక్ ఖాన్ , నాగార్జున కీలకపాత్రలో నటించి మెప్పించారు . కాగా ఫుల్ విజువల్ వండర్ తో క్రియేట్ చేసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది . దీంతో ఇప్పుడు అందరి కళ్ళు బ్రహ్మాస్త్ర 2 పై పడ్డాయి .

కాగా ఈ సినిమాలో మొదటి పార్ట్ కి సంబంధించిన నటీనటులను కాకుండా కొత్త వాళ్లను తీసుకోవడానికి అయాన్ ముఖర్జీ ట్రై చేస్తున్నారట . అంతేకాదు ఈ క్రమంలోని పార్ట్ 2 లో దీపికా పదుకొనే , విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ మొత్తం శివ తల్లిదండ్రుల గురించి నడుస్తుంది. కాగా వాళ్ళు ఎవరో బ్రహ్మాస్త్ర 2లో రివిల్ చేసే విధంగా అయాన్ ముఖర్జీ స్టోరీని రాసుకున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం రన్బీర్ కపూర్ తల్లిగా దీపిక పదుకొనే , తండ్రిగా విజయ్ దేవరకొండ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బ్రహ్మాస్త్ర 2 లో దేవ్ క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్, రన్వీర్ సింగ్ ని సంప్రదించిన వర్కౌట్ అవ్వలేదట. ఫైనల్గా విజయ్ దేవరకొండ అయితే సెట్ అవుతాడు అంటూ అయాన్ ముఖర్జీ విజయ్ దేవరకొండకు స్టోరీ వివరించగా ఆయన యాక్సెప్ట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అయితే లైగర్ సినిమాను బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఆదరణ అందుకుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేసిన విజయ్ కి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో తెలిసిందే. మరి ఇప్పుడు కూడా అదే రేంజ్ లో బ్రహ్మాస్ర 2 పై ఆశలు పెట్టుకుంటే మాత్రం బొక్క బోర్లా పడడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. విజయ్ దేవరకొండ ని యంగ్ రౌడీ హీరో గానే యాక్సెప్ట్ చేస్తారు . దేవుడు రోల్ లో విజయ్ దేవరకొండ ను యాక్సెప్ట్ చేయరు… అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . మరి చూడాలి విజయ్ దేవరకొండ ఈ బ్రహ్మాస్త్ర 2 లో ఎలా మెప్పిస్తాడో. కనీసం ఈ చిత్రంతోనైనా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి..!!