భార్య కు దిమ్మ తిరిగే సర్ ప్రైజ్ ఇచ్చిన రవీందర్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయిన వ్యక్తుల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ కూడా ఒకరు. మనకు తెలిసిందే ఈయన చూడడానికి చాలా లావుగా ఉంటాడు. అధిక బరువు. దీని కారణంగా ఈయన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రోల్ అయ్యేవారు . అయితే గత కొన్ని నెలలుగా ఈయన మరింత ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు. దానికి కారణం నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడమే .

మనకు తెలిసిందే లిబ్రా ప్రొడక్షన్ అధినేత రవీందర్ చంద్రశేఖర్ నటి మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. చూడడానికి అంత లావుగా ఉన్న ..అంత వయసు ఎక్కువైన రవీందర్ ని మహాలక్ష్మి కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకుందని ..ఆ డబ్బు ఉడ్చేశాక ఆయనను వదిలేసి వెళ్ళిపోతుందని.. చాలామంది ట్రోలింగ్ చేశారు . కానీ ఇవేమీ పట్టించుకోని ఈ జంట హ్యాపీగా తమ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు అలాంటి ట్రోలర్స్ కు బుద్ధి వచ్చేలా.. వాళ్ల మధ్య ఎంత ప్రేమ ఉందో ప్రూవ్ చేసుకున్నాడు రవీందర్ చంద్రశేఖర్ రీసెంట్గా భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఆమె ఎప్పటినుంచో ఆశపడుతున్న కారును ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. షాపింగ్ కి అంటూ సరదాగా బయటకు తీసుకెళ్లి చేసుకోవడానికి రవీందర్ చంద్రశేఖర్ ఎవరు ఊహించని విధంగా షోరూమ్ కి తీసుకెళ్లి ఆమె ఇష్టపడిన ఫేవరెట్ కలర్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.

దీంతో ఒక్కసారి మహాలక్ష్మి ఆనందంతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా చాలా కష్టం.. మనల్ని ప్రేమించే మనం ప్రేమించే వ్యక్తి తిరిగి మనల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తే అది మరింత విశేషంగా ఉంటుంది” అంటూ ..”కొత్త భార్యకి ..కొత్త జీవితం.. కొత్త కార్ ..ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారణం మనం పొందగలమని” తమిళంలో రాసుకొచ్చాడు . ఈ సందర్భంగా భార్యతో కలిసి షో రూమ్ దగ్గర దిగిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకున్నారు . ప్రస్తుతం నెట్టింట దూసుకుపోతున్నాయి. చూద్దాం ఈ జంట రానున్న రోజుల్లో ఎన్ని సర్ ప్రైజ్ లు ఇస్తుందో..?

 

Share post:

Latest