పెడన సీటు కాగితకే..అదొక్కటే రిస్క్!

వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు 120 పైనే నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన డేటాని తన వద్ద ఉంచుకుని..ఇంచార్జ్‌లకు పలు సూచనలు చేయడం, క్లాస్ పీకడం లాంటివి చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, బాదుడేబాదుడు నిర్వహణ, ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం, పార్టీ సభ్యత్వాలు, కార్యకర్తలని కలుపుని వెళ్ళడం..ఇలా పలు అంశాలపై సర్వే చేసి..ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అన్నీ బాగానే చేస్తున్న వారికి దాదాపు సీటు ఖాయం చేసేస్తున్నారు…ఇంకా మెజార్టీపై ఫోకస్ పెట్టమని చెబుతున్నారు. డైరక్ట్ గా సీటు ఫిక్స్ అని చెప్పడంలేదు గాని..మెజార్టీ పెంచుకొమంటే దాదాపు సీటు ఫిక్స్ అయినట్లే ఇంచార్జ్‌లు చెబుతున్నారు. లేదు ఇంకా కష్టపడాలి అని చెబితే వారికి సీటు కన్ఫామ్ కాదని అంటున్నారు. ఇప్పటికే చాలామందికి దాదాపు సీటు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక తాజాగా పెడన ఇంచార్జ్ కాగిత కృషప్రసాద్‌..చంద్రబాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిస్తితులని వివరించారు..అటు చంద్రబాబు కూడా పలు  సూచనలు చేసి మెజారిటీ పెంచుకోవడంపై ఫోకస్ చేయాలని చెప్పారు. దీంతో పెడన సీటు కాగితకే దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పెడన సీటు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు ఇస్తారని ప్రచారం జరిగింది. కన్ ఇప్పుడు ఆ ప్రచారానికి బ్రేక్ పడిందని చెప్పొచ్చు. పైగా ఆ మధ్య కొనకళ్ళ సైతం పెడన సీటు కాగితదే అని ప్రకటన చేశారు.

దీంతో పెడనలో కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేయడం ఖాయమే..పైగా ఇక్కడ ఆయనకు అనుకూల వాతావరణం ఉంది..మంత్రి జోగి రమేష్‌పై కాస్త వ్యతిరేకత ఉండటం, గత ఎన్నికల్లో కాగిత ఓడిపోవడం, తన తండ్రి కాగిత వెంకట్రావు చనిపోవడం లాంటి అంశాలు కృష్ణప్రసాద్‌పై సానుభూతి పెంచాయి. కీలకమైన పెడన జెడ్పీటీసీ స్థానంలో టీడీపీని గెలిపించారు. మొత్తం మీద పెడనలో కాగితకు పాజిటివ్ ఉంది..కాకపోతే జనసేన విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి..అదే కాగితకు రిస్క్..గత ఎన్నికల్లో అదే జరిగింది. కాగిత 7 వేల ఓట్ల తేడాతో ఓడితే..జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. మరి ఈ సారి పొత్తు ఉంటే ఓకే..లేదంటే కాగితకు మళ్ళీ రిస్క్.