పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ ఇస్తున్న అబ్బాయి రాంచరణ్… ఏ కేటగిరి అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే తెలుగు కుర్రాళ్ళు సంబరాలలో మునిగిపోతారు. అతని సినిమా రిలీజైతే తెలుగు రాష్ట్రాల్లోవున్న గల్లీగల్లీల్లోని థియేటర్లు మోతమోగుతాయి. సినిమా ఫలితం ఎలా వున్నా, భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగే సత్తా వున్న ఏకైక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అతనితో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు సంవత్సరాల తరబడి వేచి చూస్తూ వుంటారు. ఇకపోతే జనసేన పార్టీ స్థాపించిన తరువాత ఎక్కువ సమయం ఆయన రాజకీయాలమీదే దృష్టి సారిస్తున్నారు.

ఈ మధ్యన పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి కొన్ని రకాల దుష్టశక్తులు అతనిని వెంబడిస్తున్నట్టు రాజకీయ వర్గంలో గుసగుసలు వినబడుతున్నాయి. ముఖ్యంగా పవన్ భద్రతా విషయమై జనసేన వర్గాలు ఒకింత ఆందోళన చెందుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి కొందరు నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో పవర్ కట్ కావడం, ఆ తర్వాత హోటల్ లో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈరకమైన పెనుమార్పులు వస్తున్నాయి.

వీటికి కారణాలు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నివాసం వద్ద అగంతకులు కొందరు కారు ఆపి అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లు కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా వారు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకుని వింతగా ప్రవర్తించినట్లు భోగట్టా. గత కొన్ని రోజులుగా అనుమానాస్పద వ్యక్తులు పవన్ కళ్యాణ్ కారుని ఫాలో అవుతున్నట్లు కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని అభిమానులు కోరగా ప్రభుత్వ వైఖరి అందరికీ తెలిసిందే. అయితే దీనికోసం రాంచరణ్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ భద్రతకు ముప్పు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాంచరణ్ కంప్లీట్ గా పవన్ సెక్యూరిటీ కంట్రోల్ చేపడుతున్నట్లు టాక్ వినబడుతోంది.

Share post:

Latest