జబర్దస్త్‌ షోకి కొత్త యాంకర్ రాబోతోంది… రష్మీ పరిస్థితి ఏమిటి?

బుల్లితెర యాంకర్ రష్మీ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరంటే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఇది అక్షరాలా నిజం. తెలుగునాట భారీ డిమాండ్ ఉన్న బుల్లితెర షోలలో జబర్దస్త్ ముందు స్థానంలో ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరంనుండి అన్ని రకాల వయస్సులవారిని కితకితలు పెడుతూ భారీ టీఆర్ఫీ సాధిస్తోంది. కాగా ఈ షో.. మొదలయ్యి 8 సంవత్సరాలు కావస్తోంది. ఈ క్రమంలో తెలుగు తెరకు ఎంతోమంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. అలాగే ఈ షోలో యాంకరింగ్ చేసిన యాంకర్స్ అనసూయ, రష్మీ కూడా సినిమాలలో తమ హవాని కొనసాగిస్తున్నారు.

మొదట కొన్నేళ్ల పాటు ఈ వేదికపై హంగామా చేసిన యాంకర్ అనసూయ.. వరుసగా సినిమాలలో అవకాశాలు రావడంతో ఈ షో నుంచి తప్పుకుంది. అనసూయ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో రష్మీని పెట్టి షో విజయవంతంగా నడిపించేసారు. అయితే అప్పటికే రష్మీ ఎక్స్‌ట్రా జబర్దస్త్ హ్యాండిల్ చేస్తోంది. దాంతో రష్మీనే జబర్దస్త్ యాంకర్ గా తీసుకున్నారు. దీంతో ఈ 2 షోస్‌కి యాంకర్ గా వ్యవహరిస్తూ రష్మీ దండిగా డబ్బు, పేరు సంపాదించింది. ఇకపోతే అసలు విషయానికొస్తే, తాజాగా విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమోలో రష్మీ గౌతమ్ స్థానంలో కొత్త యాంకర్‌ కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

అవును, రష్మీ కూడా అనసూయ మాదిరి జబర్దస్త్ వీడిందా? లేక బిజీ షెడ్యూల్స్ వల్ల కొన్ని ఎపిసోడ్స్ కి దూరంగా ఉంటోందా? అనే అనుమానాలు ఇపుడు టాలీవుడ్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో కొందరు రష్మీ కి సినిమా అవకాశాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడితే, మరికొంతమంది మాత్రం రష్మీ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అంటూ చెబుతున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని… రష్మీ అభిమానులు మాత్రం రష్మీ సినిమాలలో కంటే జబర్దస్త్ షోపైనే జబర్దస్త్ గా ఉందని, ఆమె ఈ షో మానడానికి వీలు లేదని సోషల్ మీడియా వేదికగా ఆమెని బతిమిలాడుతున్నారట.

Share post:

Latest