బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఈవారం ఇంటి నుంచి బయటకు రావడం పక్కా అట!?

బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. అయితే బిగ్ బాస్ లో ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే టాప్ 5 లో ఉంటారనుకున్నా కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేషన్ అవ్వడంతో అందరూ షాక్ కి గురయ్యారు. తాజాగా మరో ఊహించని ఎలిమినేషన్ జరగనుందని సమాచారం అందుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్ జె సూర్య ఎలిమినేషన్ అవడంతో ప్రేక్షకులు ఎంతగానో నిరాశపడ్డారు.

ఇక ప్రస్తుతం ఈవారం అంతకుమించి అన్నట్టుగా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలుస్తుంది. ఇంతకీ ఆ ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ మరెవరో కాదు టైటిల్ విన్నర్ అనుకున్న గలాటా గీతు. అయితే ఈమె హౌస్ లో చేసే రచ్చ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికే ఆమె విన్నర్ అలాగే హౌస్ లో తనే తోపు అనుకుంటున్నా గీతు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనుందని సమాచారం.

కాగా ఈ వారం నామినేషన్ లో మొత్తం పదిమంది సభ్యులు ఉన్నారు. వారిలో రేవంత్, ఇనయ, కీర్తి, బాలాదిత్య, గీతు, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, మెరీనా, శ్రీ సత్య ఉండగా ఈ పదిమందిలో గీతూ గలాటా ఎలిమినేట్ అవుతుందని సమాచారం. అయితే హౌస్ లో గీతూ మొదటినుంచి ఇప్పటివరకు రచ్చ చేస్తూనే ఉంది. ఎప్పుడూ ఎవరోకరితో వివాదం పెట్టుకుంటూ.. తన మాట తీరుతో ఎదుటివారితో గొడవలు పెట్టుకుంటూ తనకి నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బిగ్ బాస్ చెప్పింది గాని.. ఇంటి సభ్యులు చెప్పింది కానీ.. విననంటూ తనకి నచ్చినట్టు గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్లో మరియు తన అభిమానుల్లో నెగిటివిటీ పెంచుకుంటూ వచ్చింది. అయితే ఈవారం గీతు ఎలిమినేట్ అయి బయటకు వచ్చిందా అన్నది నేటి ఎపిసోడ్లో చూడాలి. కాగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ గీతు ఈవారం ఇంటి నుంచి బయటకు రావడం పక్కా అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest