జనసేనకు మైనస్..టీడీపీకి ప్లస్..!

ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ-జనసేనతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఈ సారి ఆ డ్యామేజ్ జరగకుండా, జగన్‌ని నిలువరించేందుకు చంద్రబాబు, పవన్‌ని కలుపుని వెళ్ళానున్నారు. ఇక వీరి పొత్తు దాదాపు ఖాయమని చెప్పొచ్చు. వీరితో బీజేపీతో కలుస్తుందా? లేదా? అనేది ఎన్నికల ముందు తేలుతుంది.

కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్. అయితే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టమే. అయితే రెండు పార్టీలు కలిస్తే తమకే లాభమని జగన్ అంటున్నారు. టీడీపీతో కలవడం వల్ల కాపులు పూర్తిగా పవన్ వైపుకు రారని, అలాగే కొన్ని సీట్లు కోల్పోవడం వల్ల టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉండి, జనసేనకు సహకరించరని, దీని వల్ల పరోక్షంగా తమకే బెనిఫిట్ అవుతుందని జగన్ అంచనా వేస్తున్నారు.

అయితే జగన్ అంచనా పూర్తిగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే టీడీపీ-జనసేన శ్రేణులు మొదట టార్గెట్ వైసీపీకి చెక్ పెట్టడం. అలాంటప్పుడు త్యాగానికి కూడా రెడీ అవ్వోచ్చు. కాకపోతే సీట్ల పంపకాల విషయంలో కాస్త విభేదాలు మాత్రం రావోచ్చు. అయితే ఈ సీట్ల విషయంలో టీడీపీకే ఎక్కువ ఇబ్బంది అని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి జనసేనకు మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడొక లాజిక్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకులు లేకపోవడం జనసేనకు మైనస్..దాని వల్ల ఎక్కువ సీట్లు డిమాండ్ చేయలేరు.

ఇక సీట్ల త్యాగం విషయంలో బాబు ముందే ఓ స్కెచ్‌తో వస్తున్నారు. జనసేనకు కాస్త బలం ఉన్న సీట్లలో టీడీపీ తరుపున డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. దీని వల్ల వారిని తప్పించి జనసేనకు సీట్లు ఇచ్చిన పెద్ద ఇబ్బంది మాత్రం రాదు. కొన్ని చోట్ల వచ్చిన సరే..అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని కవర్ చేయొచ్చు.

Share post:

Latest