హీరోయిన్ రాశీఖన్నాకు అదంటే బాగా ఇష్టమట?

హీరోయిన్ రాశీఖన్నా గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. కొంచెం బొద్దుగా కనిపించినా అమ్మడి అందానికి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో అడుగిడిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది ఈమెకి. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఘనత ఈమెది.

కాగా నేడు రాశీఖన్నా పుట్టిన రోజు అని ఎంతమందికి తెలుసు. అవును, 1990 నవంబర్‌ 30న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది ఈ బ్యూటీ. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇష్టాఇష్టాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది ఈ పిల్ల. ఈ క్రమంలోనే పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసింది. మొక్కలు నాటుతున్న సమయంలో తీసిన ఫొటోలను షేర్ చేస్తూ ‘మొక్కలు నాటడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే పని.’ అని పేర్కొంది.

అవును, గార్డెనింగ్ అంటే అమ్మడికి బాగా ఇష్టమట. అంతేకాకుండా తన పుట్టిన రోజున ఖచ్చితంగా ఒక మొక్కైనా నాటాలి అనే నియమం పెట్టుకుందని చెబుతోంది. మంచి నియమం కదా. మీలో ఎంతమందికి ఉంటాయి ఇలాంటి అలవాట్లు. పుట్టిన రోజు వస్తే మనం కేకులు కట్ చేసుకొని ముఖాలకి పూసుకోవడమే మనకు తెలుసు. కానీ ఆమె అంత ఫేమస్ నటి అయినప్పటికీ ఎలాంటి అలవాట్లు చేసుకుందో చూడండి అని నెటిజన్లు ఒకరికొకరు క్లాసులు పీకేసుకుంటున్నారు. రాశీఖన్నా కెరీర్ విషాయానికొస్తే తాజాగా ‘సర్దార్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.

Share post:

Latest