రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే.
ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ప్రధానంగా బాలకృష్ణ, చిరంజీవి సినిమాలపైనే ఎక్కువ పోటీ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరి సీనియర్ హీరోలకు జంటగా శృతిహాసన్ నటిస్తుండటం విశేషం.
ఈ క్రమంలోనే చిరంజీవి బాలకృష్ణ 22 సంవత్సరాల క్రితం ఇదే రకంగా సంక్రాంతి పోరులో తలపడ్డారు. అప్పుడు కూడా ఇద్దరి సినిమాలలో హీరోహియిన్ ఒకరే అవటం గమనార్హం. 20001లో సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహనాయుడు, చిరంజీవి హీరోగా మృగరాజు రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో సిమ్రాన్ నే హీరోయిన్.
అయితే ఆ సంక్రాంతి బరిలో బాలకృష్ణ అఖండమైన విజయం సాధించాడు. ఇక ఇప్పుడు రాబోయే సంక్రాంతికి కూడా అదే తరహా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈసారి ఈ సంక్రాంతికి ఎవరు విజయం సాధిస్తారో లేక మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అని తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.