వైసీపీ గేమ్ వర్కౌట్..ఆ రెండు జిల్లాల్లో ప్లస్..!

రాజకీయ పార్టీలు ఏవైనా సరే..అవసరం బట్టే రాజకీయం చేస్తాయి..పైకి ఏదో ప్రజలకు మంచి చేస్తున్నట్లు చూపిస్తాయి గాని..వాటి వెనుక మాత్రం రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు. ఇక అధికార వైసీపీ అమలు చేయాలనుకుంటున్న మూడు రాజధానుల అంశంలో కూడా రాజకీయ కోణం లేకుండా లేదు. రాజకీయం లేదు అని ప్రజలు కూడా నమ్మే పరిస్తితిలో లేరు.

మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్నారు గాని..వాస్తవానికి మూడు రాజధానుల పేరుతో..ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యం. ఇటు టీడీపీ సైతం అమరావతి ద్వారా..కోస్తాలో లబ్ది పొందాలని చూస్తుంది. అమరావతి విషయం పక్కన పెడితే..మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని పరిపాలన రాజధాని పేరుతో..వైసీపీ పోరాటం కూడా చేస్తుంది. అదేంటి అధికారంలో ఉండి కూడా పోరాటం చేస్తుందనే డౌట్ రావొచ్చు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం ఉందనేది అర్ధం చేసుకోవచ్చు.

ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఆ దిశగా వెళ్ళడంలో వైసీపీ సక్సెస్ అయిందా? అంటే కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. రాజధాని సెంటిమెంట్‌తో ఉత్తరాంధ్రలో లబ్ది పొందే విషయంలో వైసీపీ ఓ అడుగు ముందుకేసింది. కాకపోతే అసలైన విశాఖలో మాత్రం రాజకీయ లబ్ది పొందడం కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖ ముందే అభివృద్ధి చెందింది..పైగా వైసీపీ ఎందుకు విశాఖని రాజధాని అంటుందో అక్కడి ప్రజలకు క్లారిటీ లేదు. అక్కడి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు.

కానీ విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు మాత్రం రాజధాని విశాఖలో వస్తుందంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు దగ్గరలో రాజధాని వస్తే..తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఆలోచన ఆ రెండు జిల్లాల ప్రజల్లో కనిపిస్తోంది. అంటే వైసీపీ ఆడే క్యాపిటల్ గేమ్..విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కాస్త వర్కౌట్ అయ్యేలా ఉంది.