unstoppable 2 promo: ఒక్క ఫోన్ కాల్ తో..చంద్రబాబుని ఇరుకున పెట్టిన బాలయ్య..!!

వచ్చేసింది..వచ్చేసింది..వచ్చేసిందోచ్..కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది . కొద్దిసేపటి క్రితమే ఆహా తన ఛానల్లో అధికారికంగా అన్ స్టాపబుల్ 2 ప్రోమో రిలీజ్ చేసింది. మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఇదివరకే షో టీం ప్రకటించింది.

అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రోమో రిలీజ్ అయ్యే కొద్ది గంటలకు ముందే చంద్రబాబుతో పాటు ఈ షోలో ఆయన వారసుడు లోకేష్ కూడా పాల్గొంటున్నారని అఫీషియల్
అనౌన్స్ చేసి నారా-నందమూరి ఫ్యాన్స్ కి మంచి కిక్కించింది. కాగా కొద్దిసేపటికి క్రితమే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో బాలకృష్ణ ఏంట్రి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . అంతేకాదు బాలకృష్ణ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నందమూరి అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

మరీ ముఖ్యంగా చంద్రబాబుతో బాలకృష్ణ ఆట ఆడించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే షోలో టాస్క్ లో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు చేత తన భార్యకు ఫోన్ చేయించి..లైవ్ లోనే ఐ లవ్ యూ చెప్పమని ఇరకాటంలో పెట్టేస్తాడు . దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి . అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా తన భార్య భువనేశ్వరి కి ఐ లవ్ యు చెప్పినట్లు తెలుస్తోంది . అంతేకాదు ఈ షోలో పొలిటికల్ యాంగిల్ లో కూడా చంద్రబాబుని ప్రశ్నలు అడిగి ఆయనలోని నిజాయితత్వాన్ని.. ఆయన ను తొక్కేయడానికి చూస్తున్న రాజకీయ దుష్టశక్తులకు కౌంటర్ వేసినట్లు కొన్ని ప్రశ్నలు ఆధారంగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే రిలీజ్అయిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. అందర్నీ ఆకట్టుకుంటుంది. మరిన్ని విషయాలు ఈ క్రింది లింక్ లో తెలుసుకోండి..!!