అనసూయ రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో టాక్.. అనసూయ రియాక్షన్ ఇదే!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగునాట ఈ అమ్మడుకి ఫాలోయింగ్ బాగానే వుంది. ఓ వైపు సినిమా, మరోవైపు టీవీ షోలతో ఈ జబర్దస్త్ ముద్దుగుమ్మ క్షణం తీరికలేకుండా గడుపుతోంది. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన శైలితో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్యకాలంలో సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫాలోయింగ్‌ను కుడా పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తోంది. దీనిలో భాగంగా ఓ కుర్రాడు తాజాగా ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు.

విషయం ఏమంటే ఇటీవల ఈ బ్యూటీ స్టార్ మా లోకి వెళ్లిపోయి, అందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. బుల్లితెరపై తనదైన హోస్టింగ్‌తో అలరిస్తూ ఎన్నో విజయవంతమైన షోలు చేసిన అనసూయ భరద్వాజ్.. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటి,కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ కనిపించింది. ఇప్పుడు బుల్లితెరపై అనసూయ షోలను మాత్రం ఒప్పుకోవట్లేదు. దీనిపై ఫ్యాన్స్ మాత్రం నిరాశగా ఉన్నారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తున్నక్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ తనను పెళ్లి చేసుకోమంటూ అనసూయకు ప్రపోజల్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇలా ఒక నెటిజన్ అనసూయ భరద్వాజ్ ని నన్ను పెళ్లి చేసుకోమని అడిగిన ప్రశ్నకు నువ్వు మాత్రం అస్సలు స్పందించలేదు’ అని అడిగాడు. దీనికి ఆమె ఏమీ మాట్లాడలేక పొయిందనే ఎమోజీని పోస్ట్ చేసింది. తాను అలానే, ఆలోచిస్తున్నట్టున్న తన ఫొటోను కూడా షేర్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య సంభాషణ హాట్ టాపిక్ గా మారింది.