తెలుగు యాంకర్ శ్రీముఖి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆమె పేరు వింటే తెలుగు యువత గుండెల్లో గుబులు పుడుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైమ్ లోనే ఆమె స్టార్ యాంకర్ గా గుర్తింపు సాధించింది. ఆమె కెరీర్ పటాస్ షోతో మొదలైన సంగతి అందరికీ తెలిసినదే. దీని తర్వాత ఆమె బిగ్ బాస్ లో పాల్గొని విశేష అభిమానులను సొంతం చేసుకుంది. ఏకంగా అందులో రన్నరప్ గా నిలిచి మరింత పాపులర్ అయింది. అయితే బిగ్ బాస్ లో ఉన్నప్పుడే ఆమె తన సీక్రెట్ లవ్ ఎఫైర్ ను బయటపెట్టింది.
తాను గతంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, అతనంటే తనకు చాలా ఇష్టం అంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది. కాగా ఇదే విషయం తాజాగా సోషల్ మీడియాలో మరలా వైరల్ అవుతోంది. ఆ సో కాల్డ్ లవర్ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే పరిచయం అయ్యాడని, అతన్ని నమ్మి చాలా దూరం వెళ్లిపోయినట్టు ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. పెండ్లి వరకు వెళ్తున్న సమయంలోనే సడెన్ గా అతని ప్రవర్తనలో మార్పు వచ్చి విడిపోయినట్టు బాధపడింది శ్రీముఖి. అంతేకాకుండా అతనికి పెండ్లి కూడా అయిపోయిందంటూ వివరించింది.
ఇక ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరా అని చాలామంది ఆరా తీశారు. చివరకు అతను ఎవరో కాదు యాంకర్ రవి అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో శ్రీముఖి, యాంకర్ రవి నడుమ లవ్ ఎఫైర్ ఉందంటూ చాలానే వార్తలు బయటకు పొక్కాయి. అతనే శ్రీముఖిని ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడంటూ అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి. కానీ వాటిపై శ్రీముఖి గానీ, రవి గానీ స్పందించలేదు. శ్రీముఖి తాజా రియాక్షన్ తో అది కాస్త క్లియర్ అయింది.