అబ్బే..ఆ విషయంలో బాలయ్య ముందు మిగతా హీరోలు వేస్ట్..ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలు యమ జోరుగా సినిమాలకు కమిట్ అవుతూ.. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ.. షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసి జనాలకు కొత్త ఊపునిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా యంగ్ హీరోలు సినిమాల కమిట్మెంట్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు . దానికి కారణం పాన్ ఇండియా సినిమాల్లోనే నటించాలి అని గిరిగిసి పెట్టుకోవడం. ఇప్పుడున్న తెలుగు స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు . ఒక్క దెబ్బకు ఐదు భాషల్లో పాపులారిటీ సంపాదించుకోవచ్చని పిచ్చి నమ్మకంతో ఇలా చేస్తున్నారు హీరోస్ అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు, అయితే వాళ్ళందరిలోకి ప్రత్యేక నందమూరి బాలయ్య.

అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్న నందమూరి ఫ్యామిలీకి ఏది సాటి రాదు. ఓ విషయంలో సహాయం చేయాలన్న ..ఓ విషయంలో స్టాండ్ తీసుకోవాలన్న.. జనాలను మెప్పించాలన్న.. అభిమానులను సంతృప్తి పరచాలన్న నందమూరి ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా. ఈ విషయం కేవలం నందమూరి అభిమానులే కాదు సినీ స్టార్ సెలబ్రిటీస్ కూడా చెప్పుకొస్తున్నారు.

కాగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా అభిమానులను మెప్పించాడు . ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ణ్భ్ఖ్ అనే టాక్ షోకు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీజన్ 2 రీసెంట్ గానే స్టార్ట్ చేశారు ఆహా టీం .

కాగా ఈ క్రమంలోని ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడుతో ఆడి పాడి అలరించిన బాలయ్య ..రెండో ఎపిసోడ్లో యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ఆట పట్టించాడు. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్గా ఆహా రిలీజ్ చేసింది. ప్రోమోలో బాలయ్య స్వీడ్ చూస్తుంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలు వేస్ట్ అని అనిపిస్తున్నారు . అంతేకాదు అక్కడ ఇద్దరు యంగ్ హీరోలు ఉన్నా కానీ బాలయ్య స్పీడు ముందు వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయారు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సీనియర్ హీరోలు చాలామంది హోస్ట్ గా చేశారు.

కానీ ఎవరు కూడా బాలయ్య లాగ మెప్పించలేదు . అంత ఎనర్జిటిక్ యాంకరింగ్ చేయలేదు . 25 ప్లస్ కుర్రాడిలా బాలయ్య వాళ్లతో ఆడుతూ పాడుతూ సరదాగా కబుర్లు చెబుతూ ..యంగ్ కుర్రడిలా డైలాగ్స్ తో అదరగొట్టేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమో చూసిన ఎవ్వరైనా సరే ఈ మాటను ఒప్పుకోవాల్సిందే. బాలయ్యతో సరి సమానంగా ఇప్పుడున్న సీనియర్ హీరోలు ఎవరు యాంకరింగ్ చేయలేరు. ఏమంటారు నిజమే కదా..!!