తన పైన తాను ఆసక్తికరమైన కామెంట్లు చేసిన శ్రీదేవి కూతురు..!!

దివంగత హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె నట వారసురాలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదటి చిత్రం ధడక్ తో మంచి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక శ్రీదేవి నిర్మాత బోనికపూర్లకు మొదటి కుమార్తె ఈ ముద్దుగుమ్మ. అందువల్లే ఈమె అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడిందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. తాజాగా తనపై వస్తున్న రూమర్లపై స్పందించింది జాన్వీ కపూర్ వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Janhvi Kapoor reveals Sridevi 'was obsessed' with the meaning of her name:  'She would keep looking at me and telling me…' | Entertainment News,The  Indian Express
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తాను ప్రజలు అనుకున్నంత అందంగా లేకపోవచ్చు.. అంతేకాకుండా వారు కోరుకుంటున్న నైపుణ్యాలు కూడా లేవని.. కానీ తాను కష్టపడి పనిచేసే అమ్మాయినని ఈ విషయంలో కచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను అంటూ తెలియజేసింది.అంతేకాకుండా ప్రస్తుతం తనకు ఇండస్ట్రీలో ఉన్న స్థానాన్ని నేను తేలికగా సంపాదించుకున్నానని అనుకుంటూ ఉంటారు. అదే వారికి నాపై ఉన్న అపోహ.. కష్టపడి పని చేయడం అంటే ఏంటో నాకు తెలియదు అనుకుంటూ ఉంటారు నేను అత్యంత ప్రతిభావంతురాలని కాకపోవచ్చు కానీ అందంగా లేకపోవచ్చు కానీ.. సినిమా షూటింగ్ సెట్లో కష్టపడి పనిచేసే వ్యక్తినని తెలియజేసింది.

Happy birthday, Janhvi Kapoor: 5 rare pics of the actress with Sridevi,  Boney Kapoor and Khushi Kapoor you don't want to miss
ఇదే విషయాన్ని నేను రక్తంతో రాతపూర్వకంగా కూడా ఇవ్వగలను కాబట్టి మీరు నా స్థానాన్ని అవమానించదు అంటూ తెలియజేసింది జాన్వీ కపూర్. ఇక ఒకే విషయాన్ని ప్రతి సారి చెప్పడం తనకు చిరాకు అని తెలియజేసింది..నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నానని నాకు తెలుసు.. నేను సమయం వృధా చేసినట్లుగా అనిపిస్తుంది.. తన తల్లి స్టార్డమ్ కి ఎవరు చేరుతారని నేను ఎప్పుడు కూడా ఆలోచించను ఆమె షూటింగ్లో ఉన్న సమయంలో నేను అక్కడ లేను ఆమె షూటింగ్లకు విరామం ఇచ్చిన తర్వాతే నేను పుట్టానని తెలియజేసింది. ఇక తన తల్లి షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు మాట్లాడే విధానం ఆమె సహకరించే విధానం చాలా మంది తనకు చెప్పారని తెలియజేసింది.

Share post:

Latest