వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి వ్యూహాత్మ‌క నాయ‌కుడు ఉండ‌ర‌ని అంటారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే త‌ర‌హాలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ రించారు. గ‌త కొన్ని రోజులుగా.. ఒక కీల‌క విషయంపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీకి.. పేరు మార్చారు. ఈ స‌మ‌యంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసింది. ఆయ‌న‌పేరు మార్చేందుకు వీల్లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

chandrababu naidu troubles with ntr health university name change issue  details, NTR, NTR health University, ysr, jagan, ap cm, chandrababu,  CBN,CBN Wall posters, ys Jagan, , ysr health university, balakrishna -  Telugu

అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. గ‌తంలోఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నప్పుడు మాట్టాడ ని గొంతులు ఇప్పుడు మాట్లాడుతున్నాయ‌ని.. ద‌మ్ముంటే.. చంద్రబాబును ప్ర‌శ్నించాల‌ని.. అప్ప‌ట్లో ఎన్టీ ఆర్ ను మాన‌సిక క్షోభ‌కు గురిచేసిన చంద్ర‌బాబుకు.. పేరు మార్పు వ్య‌వ‌హారంపై ప్ర‌శ్నించే అర్హ‌త లేద‌ని.. పేర్కొన్నారు. అయితే.. వైసీపీ నుంచి ఇన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా… చంద్ర‌బాబు ఎప్పుడు.. కూడా బ‌య‌ట ప‌డ‌లేదు.

అయితే.. ఉన్న‌ట్టుండి.. ఒక్క‌సారిగా చంద్ర‌బాబు రియాక్ట్ అయ్యారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల కు తెలిసేలా.. అసలు గ‌తంలో అంటే.. ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకునే క్ర‌మంలో ఏం జ‌రిగింద‌నే విష యంపై ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న చంద్ర‌బాబు తాజాగా ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఎమ్మెల్యే, క‌మ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ నిర్వ‌హించిన అన్ స్టాప‌బుల్‌-2లో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. కుటుంబ‌, రాజ‌కీయ విష‌యాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

అప్ప‌ట్లో పార్టీని కాపాడుకునేందుకు తాను ఎంతో ప్ర‌య‌త్నించాన‌ని.. కొంద‌రి వ్య‌క్తుల చేతుల్లోకి ఎన్టీఆర్ వెళ్లిపోతుంటే.. వ‌ద్ద‌ని వారించాన‌ని.. చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాదు.. ఎంత చెప్పినా వినిపించుకో క‌పోవ‌డంతో.. చివ‌ర‌కు ఎన్టీఆర్ కాళ్లు కూడా ప‌ట్టుకున్నాన‌ని.. అయినా..ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని వివ‌రిం చారు. ఇప్పుడు చంద్ర‌బాబు చెప్పిన గ‌తం.. వైసీపీ నేత‌ల‌కు షాక్ ఇచ్చే ఉంటుంది. ఎందుకంటే.. అప్ప ట్లో ఏం జ‌రిగింద‌నేది.. ఇప్పుడున్న వైసీపీ నేత‌ల్లో చాలా మందికితెలియ‌దు.కానీ, వారు మాట్లాడుతున్నా రు. ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు వారి నోటికి తాళం వేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.