మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా ఇదే… ఈ సారి ఆ హీరోతో రొమాన్స్ చేయనుంది!

నిన్న మొన్నటి వరకు మృణాల్ ఠాకూర్ అంటే ఎవరో తెలియదు. కానీ ‘సీతారామం’ అనే సినిమా ఏ ముహుర్తమున చేసిందే తెలియదు గాని ఇపుడు మృణాల్ ఠాకూర్ పేరు తెలుగులోనే కాకుండా యావత్ ఇండియాలో మారుమోగిపోయింది. ఆ సినిమాతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇప్పుడు తాజాగా ‘పూజా మేరీ జాన్’ అనే కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మరియు ఇది తన మునుపటి చిత్రానికి భిన్నంగా ఎలా ఉంటుందో తాజాగా ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

‘సీతారామం’లానే మృణాల్ తన తదుపరి చిత్రంలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. అయితే సీతారామంలో చేసిన పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. కాగా ఇందులో ప్రముఖ నటుడు వియజ్ రాజ్ ఓ ప్రధాన పాత్రని పోషిస్తున్నాడు. కాకపోతే ఈ రెండు పాత్రలమధ్యన రిలేషన్ ఏమిటనేది కాస్త సస్పెన్స్. బేసిగ్గా మహారాష్ట్రకు చెందిన మృణాల్ మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. జీ టీవీ సోప్ ఒపెరా కుంకుమ్ భాగ్యలో నటించి నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు.

ఇకపోతే ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేసి హిట్టు కొట్టింది. 2012లో, ఠాకూర్ అంతర్జాతీయ చిత్రం లవ్ సోనియాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. హిందీలో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఈ సంవత్సరమే విడుదలైన తెలుగు బాలీవుడ్ రీమేక్ ‘జెర్సీ’లో ఈమె ప్రధానపాత్ర పోషించిన సంగతి విదితమే. 2021లో ఠాకూర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన తూఫాన్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందారు.

Share post:

Latest