సందు దొరకడంతో అమెరికా చెక్కేసిన సమంత… అందుకోసమేనా?

సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. ‘ఏమాయచేసావే’ అనే సినిమా ద్వారా యావత్ తెలుగు కుర్రాళ్లను మాయలో పడేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగకుండా ఆ సినిమాలో యాక్ట్ చేసిన అక్కినేని వారసుడు నాగ చైతన్యను కూడా మాయ చేసి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన వారు విడాకులు తీసుకున్నారు. అది పక్కనబెడితే… సమంత ప్రస్తుతం మంచి స్వింగ్ లో వుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో ఒక్క ఐటెం సాంగ్ చేయడం ద్వారా ఒక్కసారిగా అమ్మడి కెరీర్ మారిపోయింది.

అలాగే దాని ముందు OTTలో వచ్చిన ‘ఫ్యామిలీ మాన్ 2’లో ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. దాంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషీ’ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తాజాగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సమంత అందుబాటులో లేని కారణంగానే ఈ మూవీ తదుపరి షెడ్యల్ షూటింగ్ వాయిదా పడుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

విషయం ఏమంటే, సామ్ స్కిన్ ఎలర్జీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం US వెళ్లిందని భోగట్టా. కాగా ఈ వార్తలపై సమంత తాజాగా స్పందిస్తూ, తనకు ఎలాంటి స్కిన్ సమస్యలు రాలేదని, అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేసింది. ఇదిలా వుంటే సమంత బాలీవుడ్లో త్వరలో రాజ్ అండ్ డీకెలతో కలిసి మరో వెబ్ సిరీస్ కి రెడీ అవుతోందని తెలుస్తోంది. రాజ్ అండ్ డీకె ప్రస్తుతం ‘సీటాడెల్’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ని తెరపైకి తీసుకురాబోతున్నారు.