టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన ప్రత్యామ్నాయ హీరోయిన్లు వీరే కనబడుతున్నారు?

నిన్నటి తరం టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల వయస్సు 60 పడిలో పడింది. దాంతో వారికి హీరోయిన్ల విషయంలో ఓ చిక్కు వచ్చి పడింది. కుర్ర హీరోయిన్లను వీరి పక్కన ప్రేక్షకుడు వూహించుకోలేడు. సరే వాళ్ళు కూడా వీరితో నటించడానికి సిద్ధంగా కనపడటంలేదు. ఇలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు వారికి కరెక్ట్ జోడిగా కనబడుతున్నారు. ఈమధ్య కాలంలో చూసుకుంటే, ఆయా జంటలు వెండితెరపైన బాగానే అలరించాయి.

ఇకపోతే ఈ హీరోయిన్ల జాబితాలో తమిళ సూపర్ స్టార్ నయనతార, మిల్కీ బ్యూటీ తమన్నా, చాకోలెట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్, తేనెకళ్ల సుందరి శృతి హాసన్ ఉన్నారు. ఈ నలుగురు హీరోయిన్లు ఇపుడు మన సీనియర్ హీరోల పక్కన సరిగ్గా సూట్ అవుతున్నారు. దాంతో సినీ నిర్మాతలు కూడా వారివెంటే పడుతున్నారు. అయితే అదే సమయంలో వారి రెమ్యునరేషన్ కూడా ఓ రకంగా తలనొప్పిగా మారుతోందని సమాచారం.

అవును, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో డిమాండ్ చేస్తుండటంతో ఆమెని కొందరు నిర్మాతలు అవసరాన్ని బట్టి బుక్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీలకు జోడీగా నయన్ నటించింది. ఇక శృతి హాసన్ విషయానికొస్తే ఈమె నయన్ లాగా కాకుండా పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. పైగా శృతి హాసన్ నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తుండటంతో శృతిహాసన్ కు ఛాన్స్ లు పెరుగుతున్నాయి.