విజయ్ దేవరకొండ ‘లైగర్’ పై రష్మిక సంచలన స్టేట్మంట్..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫ్యాన్స్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన పేరుకి పరిచయం లేకుండా చేసుకునే స్థాయికి ఎదిగిపోయింది ఈ కన్నడ బ్యూటీ. సినీ ఇండస్ట్రీలోకి “ఛలో” అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఆ తర్వాత తన నటనతో క్రేజ్ తో బడా హీరో సినిమాలలో అవకాశాలు అందుకుంటూ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..టాలీవుడ్ స్టార్స్ అయిన అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకొని తన క్రేజ్ ను మరింత పెంచుకునింది . అంతేనా ఏకంగా నేషనల్ క్రష్ అంటూ ఒక ముద్ర కూడా వేయించుకుంది.

Film Collection: How successful was Rashmika Mandanna at the box office,  know the budget and collection of her films – PressWire18

కాగా రష్మిక మందన్నా కెరియర్ పరంగా ఎలా ఉన్నా పర్సనల్ విషయంలో మాత్రం ట్రోల్ అవుతూనే ఉంది, అదే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక ప్రేమాయణం నడుపుతుంది అంటూ టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కోలీవుడ్ లోనూ వరుసగా వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఈ వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి. దానికి కారణం లైగర్ . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడికెళ్ళిన విజయ్ దేవరకొండకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీకు రష్మికకు మధ్య ఏముంది ..? మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి..? అంటూ పదేపదే విసిగించడం లాంటి ప్రశ్నలు అడగడంతో రష్మిక మందన విజయ్ దేవరకొండ పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయాయి.

Are Vijay Deverakonda & Rashmika Mandanna coming together again? Read all  details here | IWMBuzz

కాగా ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.న్దీంతో కొన్ని రోజులు రష్మిక మందన విజయ్ దేవరకొండ పేర్లకు బ్రేక్ పడింది. కాగా రీసెంట్గా ఆమె బాలీవుడ్లో నటిస్తున్న గుడ్ బై సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది . అక్టోబర్ 7న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ లైగర్ పై స్పందించింది. యాంకర్ విజయ్ దేవరకొండ ప్రస్తావన తెచ్చి,, అతని తాజా చిత్రం లైగర్ గురించి అడిగారు.

GoodBye movie poster release, Rashmika Mandanna seen with Amitabh Bachchan

లైగర్ సినిమా అన్నిచోట్ల డిజాస్టర్ గా నిలిచింది మరి మీరేమంటారు..? విజయ్ దేవరకొండ లైగర్ మూవీ పై మీ స్పందన ఏంటి..? అని యాంకర్ ప్రశ్నించగా.. రష్మిక తనలోని ప్రేమను మరోసారి బయటపెట్టింది . ఆమె మాట్లాడుతూ ..”నాకు మాస్ మూవీలు అంటే ఇష్టం.. నేను మాస్ మూవీ లవర్ ని కాబట్టి కచ్చితంగా నాకు ఈ సినిమా నచ్చుతుంది .చాలా ఎంజాయ్ చేశాను ..మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాకు విజయ్ నటన తెగ నచ్చేసింది . ఈ సినిమా కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు . తన బాడీని మొత్తం మార్చేసుకున్నాడు. అతని పాత్ర నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది.” దీంతో రష్మిక మాటలు వైరల్ గా మారాయి . అంతేకాదు ఫ్లాప్ అయిన సినిమాను పట్టుకొని రష్మిక ఇలా పొగిడేయడం జనాలకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఏది ఏమైనా కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మాత్రం మంచికి కిక్ ఇచ్చాయి రష్మిక మాటలు. దీంతో ఈ మాటలను వైరల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.!!

Vijay Deverakonda's Alleged GF, Rashmika Mandanna Likes His Film, Liger's  Poster, Calls Him 'Beast'

Share post:

Latest