నటుడు నరేష్‌ గుట్టువిప్పిన నాగబాబు… మానసిక రోగం ఉందంటూ దెప్పిపొడుపు!

టాలీవుడ్ నటుడు, ఘట్టమనేని వారసుడు నరేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈయన పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలకి ఈయన హీరో. ప్రస్తుతం ఆయన అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. తండ్రి, మామయ్య, స్నేహితుడు, బావ వంటి పాత్రల్లో నటించి ఇప్పటికీ తెలుగు తెరపై విశ్రమించకుండా కనబడుతున్నారు. ఇక ఈ మధ్యన నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం ఇండస్ట్రీలో ఎంత పెద్ద దుమారం సృష్టించిందో అయ్యిందో తెలిసిందే.

పవిత్ర లోకేష్‌తో నరేష్ సహజీవనం అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. నిప్పులేనిదే పొగ రాదన్నట్టు వారు కూడా బయట విచ్చలవిడిగా కనబడటం ఇలాంటి వార్తలకు చాలా బలం చేకూర్చింది. నరేష్‌కు ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు జరిగాయట. కాగా ఆయన ప్రస్తుతం నాలుగో పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నదని టాక్ వినిపిస్తోంది. నరేష్ విషయానికి వస్తే… ప్రముఖ నటి విజయ నిర్మల కొడుకు అన్న విషయం అందరికీ విదితమే. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో వీరిమధ్య ప్రేమ చిగురించగా, ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు.

అయితే అప్పటి నుంచి నరేష్ కూడా వీరితోనే ఉండసాగాడు. ఇక అసలు విషయానికొస్తే, తాజాగా నరేష్ పై మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అంత చేతకాని ప్రెసిడెంట్ ని ఇంతవరకు చూడలేదని అన్నారు. నరేష్ ఎప్పుడూ తన కెపాసిటీకి మించి ఆలోచిస్తాడని ఎద్దేవా చేసాడు. తాను దైవాంశ సంభూతడనే భ్రమలో ఉంటాడన్నారు. అందుకే కృష్ణుడి పాత్ర చేశానని.. చక్రం తిప్పానని, నరేష్‌ది అదొక రకమైన మానసిక జబ్బు అంటూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మాటలకు నరేష్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

Share post:

Latest