వామ్మో..ఆ విషయంలో నయన్ ను ఫాలో అవుతున్న హన్సిక.. కొంప కూల్చేసే డెసీషన్..!!

ఏంటో ఈ ముద్దుగుమ్మలు .. దాచుకోవాల్సిన అందాలనే విప్పుకుని చూపిస్తారు. చెప్పుకోవాల్సిన మ్యాటర్ ని గుట్టు చప్పుడు కాకుండా ఫినిష్ చేస్తారు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే స్టార్ హీరోయిన్స్ అందరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేసుకొని ..బిడ్డలను కనేసి ఆ తర్వాత మేటర్ ని అభిమానులకి చేరవేస్తున్నారు .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇ హీరోయిన్ నయనతార ఎంత చిక్కుల్లో పడిందో తెలిసిందే. కాగా రీసెంట్ గా అదే తప్పు చేయబోతుంది హన్సిక అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన హన్సిక.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం . కాగా కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన న్యూస్ ని ఓ ప్రముఖ ఛానల్ అఫీషియల్ గా ప్రకటించింది . పక్క ఆధారాలతో హన్సిక డిసంబర్ 4వ తేదీ గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నట్లు సదరు ఛానల్ చెప్పుకొచ్చింది .


అంతేకాదు డిసెంబర్ రెండవ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయని.. అదే రోజు రాత్రి సూఫీ నైట్ నిర్వహిస్తున్నారని ..ఆ తర్వాతి రోజు మెహంది ..ఆ తర్వాత రోజు సంగీత్ కార్యక్రమాలు ఉంటాయని ఆ ఛానల్ వెల్లడించింది. డిసెంబర్ 4వ తేదీ అతిరథ మహారాజుల సమక్షంలో హన్సిక తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుందట . అయితే ఈ పెళ్లికి స్టార్ సెలబ్రిటీస్ ఎవరు అటెండ్ అవ్వడం లేదని తెలుస్తుంది . కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లిలో కనిపిస్తారని ..పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఫోటో వీడియో కాని సోషల్ మీడియాలో లీక్ కాకుండా చూసేందుకు హన్సిక జాగ్రత్త పడుతుందట . నయనతార కూడా ఇలాగే పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకొని ఆ తరువాత పెళ్లయ్యాక తీరికగా మేటర్ ని చెప్పింది . ఇప్పుడు ఇదే లిస్టులోకి యాడ్ అవబోతుంది హన్సిక.