బాపట్ల టాప్..ఆ ఒక్కటే టీడీపీకి డౌట్?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక..అప్పటిలోనే చంద్రబాబు టీడీపీలో అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే. అందులో మొదటిగా జిల్లాల వారీగా అధ్యక్షులని తీసేసి..పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టిన విషయం తెలిసిందే..25 స్థానాలకు 25 అధ్యక్షులని పెట్టారు. ఇదంతా జిల్లాల విభజన జరగక ముందే జరిగింది. ఇక పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకురావడమే లక్ష్యంగా అధ్యక్షులు పనిచేస్తూ వస్తున్నారు.

అయితే మొదట్లో కొందరు సరిగ్గా పనిచేయలేదు..తర్వాత తర్వాత కాస్త నిదానంగా పనిచేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పటికీ కొందరి అధ్యక్షుల పనితీరు పెద్దగా బాగోలేదనే తెలుస్తోంది. ఇటీవల టీడీపీ అంతర్గత సర్వేలో ఏ ఏ పార్లమెంట్ స్థానంలో పార్టీ పరిస్తితి మెరుగ్గా ఉందనే అంశంపై సర్వే జరిగినట్లు తెలిసింది. దీని ప్రకారం దాదాపు 13 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ పరిస్తితి బాగోలేదని తేలిందట. 7 స్థానాల్లో కాస్త మెరుగ్గానే ఉండగా, 5 స్థానాల్లో మాత్రం టీడీపీ పరిస్తితి చాలా బాగుందని తెలిసింది.

అయితే టాప్ 1 పొజిషన్‌లో బాపట్ల పార్లమెంట్ స్థానం ఉందని తేలింది. ఈ స్థానంలో టీడీపీ పరిస్తితి మెరుగ్గా ఉందని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో కూడా ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే. పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల సీట్లు గెలుచుకుంది. సంతనూతలపాడు, బాపట్ల, వేమూరు స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఇందులో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ వైపుకు వెళ్లారు.

ఇక బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడుగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పనిచేస్తున్నారు. తన స్థానంలో బలం పెంచుకుంటూనే…మిగిలిన ఆరు స్థానాల్లోనే నేతలని సమన్వయం చేసుకుంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలని విజయవంతంగా అమలు చేస్తున్నారు. దీంతో బాపట్ల పరిధిలో టీడీపీ చాలా మెరుగు పడింది. ఎలాగో పర్చూరు, అద్దంకి, రేపల్లెలో టీడీపీ బలంగానే ఉంది. ఇక బాపట్ల, వేమూరు స్థానాల్లో బాగా స్ట్రాంగ్ అయింది. అటు సంతనూతలపాడులో పార్టీ పరిస్తితి మెరుగ్గానే ఉంది. చీరాలలో కాస్త వెనుకబడి ఉంది..కానీ ఇక్కడ వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ నేత కొండయ్య గట్టిగా కష్టపడితే చీరాలలో కూడా పార్టీ లీడ్‌లోకి వస్తుంది. ఓవరాల్‌గా బాపట్ల పరిధిలో టీడీపీ పరిస్తితి బాగుంది.