అచ్చం కవలలుగా కనిపించే 13 మంది హీరోయిన్స్ వున్నారు తెలుసా?

మీరు విన్నది నిజమే. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారనేది ఎప్పటినుండో వస్తున్న ఓ నానుడి. ఈ విషయాన్ని నిజం చేస్తూ అనేక విషయాలు మన చుట్టూ జరుగుతాయి. అంతెందుకు ఇక్కడ వున్న ప్రతి ఒక్కరికి ఓ అనుభవం వుండే ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళినపుడు హఠాత్తుగా ఎవరో ఒకరు మీరు… పలానా వ్యక్తిలాగా వున్నారని అంటే మీకు ఎలా ఉంటుంది? వెంటనే ఆశ్చర్యపోతారు కదూ. కానీ ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు.

అవును, మనల్ని పోలిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉండనే ఉంటాడు. అంతెందుకు మన భారతీయ హీరోయిన్ల విషయానికొస్తే, సేమ్ టు సేమ్ వున్నవారు మనకు ఎందరో తారస పడతారు. ఉదాహరణకు ఇటీవల స్వాతిముత్యం సినిమా ద్వారా తెలుగువాళ్ళని అలరించిన కేరళ కుట్టి వర్ష అచ్చం మరో మలయాళం నటి నజ్రియా నజీమ్ లాగా ఉంటుంది. ఇక హాలీవుడ్ విషయానికొస్తే స్టార్ ఏంజలీనా జోలి, బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఫేస్ ఫీచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసినదే.

అలాగే తమిళ నటి అమలా పాల్ కి, దీపికా పదుకొనే కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. భారతీయ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కళ్ళు స్నేహ ఉల్లాల్ కళ్ళు ఒకేలాగా ఉంటాయి. ఇంకా చూడటానికి ఆమె ఐశ్వర్య రాయ్ చెల్లెలిలాగా కనబడుతుంది. పవర్ స్టార్ గుడుంబా శంకర్ సినిమాలో నటించిన మీరా జాస్మిన్, చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించిన సుజిత ఒకే లాగా ఉంటారు. అలాగే నిత్యా మీనన్ అలనాటి అందాల తార సౌందర్యకి దగ్గరగా ఉంటుంది. ఇంకా ఇలియానా కి, రెజీనా కి కూడా దగ్గర పోలికలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది వుంటారు. మీకు సేమ్ అనిపించిన ఇద్దరు నటీమణుల పేర్లు ఇక్కడ కామెంట్ చేయండి.