దబిడి దిబిడే అంటూ బాలయ్య పై షాకింగ్ కామెంట్ చేసిన రోజా..!!

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై జడ్జిగా మరొకవైపు రాజకీయ నాయకురాలుగా ఎంతో పేరు సంపాదించింది నటి రోజా సెల్వమణి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. దీంతో నందమూరి అభిమానులతో పాటు, టిడిపి నేతలతో పాటు, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై పలు రకాలుగా స్పందించడం జరిగింది. ఇక నిన్నటి రోజున బాలయ్య పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈరోజు నగరి ఎమ్మెల్యే రోజా బాలకృష్ణపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది వాటి గురించి తెలుసుకుందాం.

ఏకంగా సినిమా డైలాగుతోనే రోజా నందమూరి బాలకృష్ణ కు కౌంటర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక రోజా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ బాలయ్య మాటలకు సమాధానం ఇస్తూ బాలయ్య ఫ్లూట్ బాబు ముందు ఊదు.. జగనన్న ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జగన్ అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే అంటూ రోజా ఒక ట్విట్ చేయడంతో ప్రస్తుతం అ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది. బాలకృష్ణ ఇలాంటి పోస్ట్ చేయడంతో ఎంతోమంది నాయకులు సైతం ఊహించని విధంగా స్పందించారు.

 

మరి కొంతమంది మాత్రం నందమూరి పార్టీని మీ చేతిలోకి తీసుకోండి అనవసరంగా తొడలు కొట్టడం కాదు ముందు మీ పార్టీని మీ చేతిలోకి తీసుకోండి అంటూ గట్టిగానే పలువురు నేతలు సైతం కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తన 107వ సినిమాకు సంబంధించి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. బాలయ్య అటు రాజకీయాలను ఇటు సినిమాలను ఒకేసారి మెయింటైన్ చేస్తూ అభిమానులకు సైతం ఆనందాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest