కుర్రాళ్లకు చెక్ పెడుతున్న రవితేజ హీరోయిన్… అందచందాలతో కవ్వింపు!

ఈమధ్య కాలంలో హీరోయిన్స్ సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఓ సరికొత్త పంతాని ఎంచుకున్నారు. తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడకపోయినా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ కధనం చదవాల్సిందే. సోషల్ మీడియా అనేది ఎంతగా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ వేదికగా యాక్ట్రెస్ వారికి నచ్చినట్లు నెటిజన్లును ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక చాలా కాలంగా ఒక బ్యూటీ కూడా ఇదే తరహాలో యువకులను తనవైపు కు తిప్పుకునేలా ట్రై చేస్తోంది.

ఆమె మరెవరో కాదు ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా మెరిసిన దివ్యాంశ కౌశిక్. తాజాగా ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ తో మళ్ళీ తన ఫాలోవర్స్ ను రెచ్చగొట్టేలా షాక్ ఇచ్చింది. ఒక వీడియో పోస్ట్ చేయడంతో నిమిషాల్లోనే దానికి మంచి రెస్పాన్స్ రావడం కొసమెరుపు. రామారావు ఆన్ డ్యూటీ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఈ బ్యూటీ ఎంతోకొంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచేది. గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా రెడీ ఉంది కాబట్టి సరైన సక్సెస్ దక్కే వరకు కొంత జనాల దృష్టిని ఎదో ఒక విధంగా ఆకర్షించక తప్పదు.

కాబట్టి ఈ అమ్మడు సోషల్ మీడియా ఫార్ములాను ఫాలో అవుతోంది. దివ్యాంశ కౌశిక్ ఇదివరకే నాగచైతన్య మజిలీ సినిమాలో హీరో ఫస్ట్ లవర్ గా కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు గాను అమ్మడు మంచి క్రేజ్ అందుకొని సైమా అవార్డ్స్ లో కూడా బెస్ట్ డెబ్యూ హీరోయిన్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అయితే ఆ సినిమా అనంతరం అమ్మడు చిన్న సినిమాలలో అవకాశాలు వచ్చినా రిస్క్ చేయలేదు. కాస్త క్రేజ్ ఉన్న హీరోలతోనే సినిమాలు చేయాలి అని కొంత కాలం ఎదురు చూసింది. ఇక మొత్తానికి రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకుని రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మెరిసింది.

Share post:

Latest