వచ్చే నెలలో రష్మి పెళ్లి..అంత మల్లెమాల పుణ్యమే..!?

జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ- రష్మీ ఇద్దరు కూడా జబర్దస్త్ ను మరో లెవల్ కు తీసుకెళ్ళారు. తాజాగా అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పి సినిమాలో బిజీగా నటిస్తుంది. రష్మి జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లో వ్యాఖ్యాతగా ఉంటూ బిజీ యాంకర్ గా మారిపోయింది. తాజాగా జరిగిన జబర్దస్త్ షోలో ఒక స్కిట్ లో రష్మి గురించి ఆసక్తికర డైలాగులు వచ్చాయి.

Extra Jabardasth Anchor Rashmi Gautam Latest Photos | Manalokam

జబర్దస్త్ లోని ఆటో రామ్ ప్రసాద్ టీం చేసిన స్కిట్లో రష్మిని పెళ్లెప్పుడు చేసుకుంటావని డైలాగ్ తో చాలా ఇబ్బంది పెట్టే విధంగా స్కిట్‌ను పెర్ఫాం చేశారు. రష్మీ కూడా వాళ్ళకి ఇదే రకంగా ధీటుగా ఆన్సర్లు ఇచ్చింది. వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటానంటూ దసరా పండగ వస్తుంది కదా అప్పుడు ఏదో ఒక షోలో పెళ్లి చేసుకుంటానని రష్మీ చెప్పింది. అయితే రష్మి షోలో మాత్రమే పెళ్లి చేసుకుంటుందట బయట పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్థమవుతుంది.

Share post:

Latest