మెగా హీరో వైష్ణవ తేజ్ షాకింగ్ కామెంట్స్, ఆ హీరోయిన్ మీద రొమాంటిక్ ఫీలింగ్స్..

మెగా ఫామిలీ నుండి మెగాస్టార్ మేనల్లుడు,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ తేజ్ హీరో గ ఇంట్రడ్యూస్ అయిన సంగతి తెలిసిందే.బుచ్చిబాబు దర్శకత్వం లో వచ్చిన తన డెబ్యూ సినిమా ఉప్పెన తో హిట్ కొట్టాడు వైష్ణవ్.తర్వాత రకుల్ తో కలిసి కొండపొలం సినిమా చేసాడు.ఈ సినిమా లో నటన పరంగా చాల ఇంప్రూవ్ అయ్యాడు.అయితే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కేతిక శర్మ కలిసి నటించిన రంగ రంగ వైభవంగా థియేటర్స్ లో వుంది.

వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా నుండి ఈ సినిమా వరకు ప్రతీ సినిమా లో ఒక రొమాంటిక్ సాంగ్ కచ్చితంగా ఉంటోంది.ఇక ఉప్పెన సినిమా లో ని జల జల జలపాతం నువ్వు పాట అయితే చాల పెద్ద హిట్.అలాగే కొండపొలం లో రకుల్ తో రైన్ సాంగ్ కూడా వుంది.తాజాగ రంగ రంగ వైభవంగా సినిమా లో కూడా రొమాంటిక్ సాంగ్ వుంది..ఇదే రొమాంటిక్ సాంగ్స్ విషయం అలీ తో సరదాగా షో లో వైష్ణవ్ ని అడగ్గా అలా తనకు కుదిరేసిందని సమాధానం చెప్పాడు.అయినా కెమెరా ముందు టీం అంత చూస్తుండగా ఉప్పెన లో సాంగ్ చేయటానికి ఇబ్బంది పడ్డానని చెప్పాడు.ఎవరు చూడకుంటే పర్లేదు అని అలీ అంటే నావేసి ఊరుకున్నాడు. ఈ క్రమంలోనే వైష్ణవ్ రంగ రంగ వైభవంగా సినిమా థియేటర్స్ లో వుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైష్ణవ తేజ్ చేసిన కామెంట్స్ అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి.

ఈ సినిమా ప్రేమోషన్ లో భాగంగా ఇందులో క్యారెక్టర్స్ గురించి చెప్తూ హీరోయిన్ కేతిక గురించి మాట్లాడాడు.కేతిక తో నటించటం వల్ల తనకు సిగ్గు తగ్గిపోయి,బాగా నటించగలిగానని చెప్పాడు.కేతిక తనకు బాగా సపోర్ట్ చేసిందని అందుకే ఈజీ గ నటించగలిగానని చెప్పాడు.అయితే కేతిక తో రొమాంటిక్ సీన్స్ చేస్తున్నపుడు తనకు నిజంగానే రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చాయని చెప్పటం అందరిని షాక్ కి గురి చేసింది.అయినా ఇలా అందరి ముందు చెప్పటం వెనక వైష్ణవ్ ఆంతర్యం ఏమిటో మరి.ఈ సినిమా రివ్యూ లో స్టోరీ ఏమి లేకున్నా వైష్ణవ్ రొమాన్స్ బాగా చేసారని కామెంట్స్ రావటం కొసమెరుపు.