ఎన్టీఆర్ ఫై కెసిఆర్ పొలిటికల్ బ్రహ్మాస్త్రం..

తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ మీద పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది అనే వార్తలు అపుడే మొదలయ్యాయి.అందుకే బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసారని ఎన్టీఆర్ ఫాన్స్ కెసిఆర్ మీద ఫైర్ అయిపోతున్నారు.బ్రహాస్త్రం సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా.ఈ సినిమా లో రన్బీర్ కపూర్ ,అలియా భట్ హీరో ,హీరోయిన్స్.నాగార్జున,అమితాబ్ బచ్చన్ లు పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా ని రాజమౌళి గారు తెలుగు లో సమర్పిస్తున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్.

బ్రహ్మాస్త్రం వంటి భారీ పాన్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఎత్తున ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసారు.అయితే 24 గంటల ముందు ఈ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది.అయితే లాస్ట్ మినిట్ లో పర్మిషన్ కి అప్లై చేయటం తో వినాయక చవితి సందర్బంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రీత్యా పోలీస్ లు ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో కాబట్టి,సిటీ బయట ఏర్పాటు చేసిన ఫంక్షన్ తో వినాయక చవితి కి ఎటువంటి సంబంధం లేదని,ఇది కెసిఆర్ ఆడుతున్న నాటకం అనిపిస్తుంది.ఇటీవల అమిత్ షా ని ఎన్టీఆర్ కలిసిన విషయం అందరికి తెలిసిందే.బీజేపీకి ఝలక్ ఇవ్వటానికి కెసిఆర్ పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ chesara a??అపుడే కెసిఆర్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసారా?

ఏది ఏమయినా ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం కెసిఆర్ ఫై మంది పడుతున్నారు.ఇదంతా కెసిఆర్ ఆడిస్తున్న నాటకం అని,ఎన్టీఆర్ ని ఎవరు ఏమి చేయలేరని అంటున్నారు.గతం లో కూడా కెసిఆర్ రామోజీ ఫిలిం సిటీ మీద గుర్రు గ వున్నారు.తర్వాత పెద్దల జోక్యం తో అది సర్దుమణిగింది.ఒక వేల మల్లి అలాగే తెలంగాణ లో రాజకీయ పోరు మొదలయిందా?