మెగా ఇంట పెళ్లి భాజా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి పెళ్లి కుదిరిపోయిందోచ్..!?

ఏంటో సినీ ఇండస్ట్రీలో.. వరుసగా స్టార్ హీరోస్, హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్లో ఉన్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ అందరూ కూడా తమ ప్రేమించిన అమ్మాయిలను అబ్బాయిలను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతూ ..ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నాడో.. అంతే త్వరగా గుడ్ న్యూస్ చెబుతూ త్వరలోనే పాపనో బాబునో ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. దీంతో వాళ్ళ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా అలాంటి గుడ్ న్యూస్ ని వినిపించబోతున్నాడొ మెగా హీరో.

గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుందని. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆమె తల్లి కాబోతుందని అందుకే ఆమెను ఇంటి నుంచి బయటకు రానివ్వట్లేదని.. మెగా వారసుడు పుట్టాక అఫీషియల్ గా ఒకేసారి చెప్తారని.. ఇప్పుడే ఉపాసన ప్రెగ్నెంట్ అని చెప్తే దిష్టి తగులుతుందని ..ఉపాసనను కాలు కింద పెట్టనీకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారట అత్తగారు . దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . కాగా ఇలాంటి సందర్భంలోనే మరో మెగా గుడ్ న్యూస్ అభిమానుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట . ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వన్ అఫ్ ది హీరో సాయి ధరమ్ తేజ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో నటించి అలరించి మెప్పిస్తున్నాడు. కాగా ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలూస్తుంది. ఆయన సినీ ఇండస్ట్రీకి రాకముందే తన ఫ్రెండ్ ని ప్రేమించాడని కాకపోతే ఆమె ఫారినర్ అని ..ఇన్నాళ్లు ఇంట్లో అడ్డు చెప్తూ వచ్చారట.. ఫైనల్లీ నేను ఆ అమ్మాయిని తప్పిస్తే వేరే వాళ్ళు చేసుకోనని మొండి పట్టుదల పట్టడంతో మెగా ఫ్యామిలీ దిగ్గి వచ్చి ఆ ఫారినర్ అమ్మాయితో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. ఇదే న్యూస్ మెగా కాంపౌండ్ నుండి లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .మరి కొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీ నుండి గుడ్ న్యూస్ రావడంలో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.